Andhra Pradesh : అక్కని పెళ్లి చేసుకొని చెల్లితో ఎఫైర్ నడిపిన ప్రభుద్దుడు.. హత్య చేసి తల, మొండెం వేరుచేసిన మామ
Andhra Pradesh : శ్రీ సత్య సాయి జిల్లాలోని ముదిగుబ్బ మండలంలో చోటుచేసుకున్న ఓ భయానక హత్యకేసు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి తన అల్లుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. తల, మొండెం వేరు చేసి హత్య చేయడం స్థానికులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది.ధర్మవరం పట్టణానికి చెందిన విశ్వనాథ్ అనే వ్యక్తి 20 ఏళ్ల క్రితం వెంకటరమణప్ప అనే రైతు పెద్ద కుమార్తె శ్యామలతో వివాహం చేసుకున్నాడు.
Andhra Pradesh : దారుణాతి దారుణం..
కుటుంబ సంబంధాల ముసుగులో, వెంకటరమణప్ప రెండో కుమార్తెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు విశ్వనాథ్ . ఈ క్రమంలో వారి కుటుంబంలో తీవ్ర వివాదాలు చోటుచేసుకున్నాయి. అయితే విశ్వనాథ్ ఆయన మొదటి భార్యను వదిలేసి, అత్త, మరదలితో కలిసి కదిరిలో ఉండసాగాడు.తన పేరు మీద ఉన్న భూమిని అమ్మేందుకు విశ్వనాథ్ ప్రయత్నించడాన్ని మామ వెంకటరమణప్ప జీర్ణించుకోలేకపోయాడు.
Andhra Pradesh : అక్కని పెళ్లి చేసుకొని చెల్లితో ఎఫైర్ నడిపిన ప్రభుద్దుడు.. హత్య చేసి తల, మొండెం వేరుచేసిన మామ
అక్రమ సంబంధం, ఆస్తి లావాదేవీలు అన్నీ కలిపి తీవ్ర కోపంతో ఉన్న వెంకటరమణప్ప, అల్లుడిని హత్య చేయాలని ప్లాన్ చేశాడు. ఈ పథకంలో భాగంగా తన మిత్రుడు కాటమయ్యకు నాలుగు లక్షల రూపాయల సుపారీ ఇచ్చి హత్యకు కుట్ర పన్నాడు.జూలై 3వ తేదీన, “50 వేల రూపాయలు సహాయం చేస్తానని” నమ్మబలికిన కాటమయ్య, విశ్వనాథ్‌ను ముదిగుబ్బకు రప్పించి కొండ ప్రాంతానికి తీసుకెళ్లి, వెంకటరమణప్ప, కాటమయ్యతో పాటు మరో ముగ్గురు కలిసి అతి దారుణంగా హత్య చేశారు. నేరానికి అనంతరం, హత్యలో వాడిన మూడు వేట కొడవళ్ళు, ఆటో, ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.