AP Budget 2024 Live Updates : ఏపీ బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌.. రూ. 2,86,389 కోట్లతో వార్షిక బడ్జెట్..!

AP Budget 2024 : ఈ రోజు బుధవారం ఏపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఏపీలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న క్రమంలో ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశం పెడుతుంది. మూడు నెలల కాలానికి అంటే జూన్ వరకు ప్రభుత్వం చేయబోయే ఖర్చులకు బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఉదయం 11: 03 నిమిషాలకు ప్రారంభమైన 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో ప్రవేశపెట్టారు. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి శాసనమండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

అలాగే సభలో మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆర్జేయుకేటి విశ్వవిద్యాలయం సవరణ బిల్లు – 2024,ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ బిల్లు – 2024, ఏపీ ఉద్యోగుల నియామకాలు, క్రమబద్ధీకరణ, రేషనరైజేషన్ సంబంధిత సవరణ బిల్లు – 2024 లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ సమావేశంలో రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఈ క్రమంలో పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ నినాదాల మధ్య సభలో పలు బిల్లులకు ఆమోదం తెలిపారు…

టీడీపీ సభ్యులు ఆందోళన చేయడంతో అసెంబ్లీ నుంచి ఒక రోజు పాటు టీడీపీ సభ్యుల సస్పెన్షన్ జరిగింది. రెడ్ లైన్ దాటి స్పీకర్ పోడియం ఎక్కిన టీడీపీ సభ్యులు ఒకరోజు పాటు స్పీకర్ సస్పెన్షన్ చేయడం జరిగింది. తీర్మానం పై టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అంతటితో ఆగకుండా టీడీపీ సభ్యులు రెడ్ లైన్ దాటి స్పీకర్ పై కాగితాలు చించి విసిరేసారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలంటూ నినాదాలు చేశారు. అయినా టీడీపీ సభ్యుల నినాదాల మధ్య సభలో పలు బిల్లులకు ఆమోదం తెలిపారు.

AP Budget 2024 Live Updates : ఏపీ బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌.. పథకాలకు కేటాయింపులు

AP Budget 2024 Live Updates : ఏపీ బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌.. : వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితి 25 లక్షలకు పెంపు, 21 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో వర్చువల్ ల్యాబ్స్, క్లాస్ రూమ్స్, జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 26,067 కోట్ల వ్యయం, వైయస్సార్ ఆసరా పథకం కోసం రూ. 25,571 కోట్లు ఖర్చు, వైయస్సార్ చేయూత పథకం కోసం 14,129 కోట్లు చెల్లింపు, జగనన్న పాలవెల్లువ పథకం కోసం రూ. 2697 కోట్లు ఖర్చు, రైతు భరోసాతో 53 లక్షల మందికి 33 వేల 300 కోట్లు జమ. వైయస్సార్ ఉచిత పంటల బీమా తో 54 లక్షల 59 వేల మంది రైతులకు 7,082 కోట్లు.

దేశంలోనే ఆక్వా హబ్ గా ఏపీ

వైద్య ఆరోగ్య రంగంలో నాడు నేడు పథకం అమలు చేశాం. ఉప ఆరోగ్య కేంద్రాల నుంచి బోధనాసుపత్రుల వరకు 16,852 కోట్లు వ్యయం చేసాం. 10,778 రైతు భరోసా కేంద్రాలు ఓన్ స్టాప్ సెంటర్లుగా ఏర్పాటు చేసాం. 3000 కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. ఆక్వా ఉత్పత్తిని మరింత పెంచేలా పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టాం. 2000 పైగా ఫిష్ ఆంధ్ర రిటైల్ దుకాణాలు స్థాపించాం. తద్వారా ఏపీ దేశంలోనే ఆక్వా హబ్ గా తయారైంది.

2024 25 ఆర్థిక సంవత్సరంలో 2,05,352 కోట్ల రెవెన్యూ రాబడి

AP Budget 2024 Live Updates : ఏపీ బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌.. :  2024-25 ఆర్థిక సంవత్సరంలో 2,05,352 కోట్లు రెవెన్యూ రాబడి వస్తుందని అంచనా. కేంద్ర పన్నుల ద్వారా 49,286 కోట్ల మేర వస్తుందని అంచనా. రాష్ట్ర పన్నుల ద్వారా 1,09,538 కోట్లు వస్తుందని అంచనా. పన్నేతరాదాయంగా 14,400 కోట్లు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా 32,127 కోట్లు వస్తుందని అంచనా. బహిరంగ మార్కెట్ ద్వారా 71 వేల కోట్లను రుణ సేకరణ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం. కేంద్రం నుంచి 61,642 కోట్లు రుణం తీసుకోవాలని యోచిస్తున్న ప్రభుత్వం. ఇతర మార్గాల ద్వారా 25 వేల కోట్ల అప్పు చేయాలని బడ్జెట్లో ప్రతిపాదన.

అంగన్వాడీల అభివృద్ధి

14,255 అంగన్వాడీ కేంద్రాలను మరింత మెరుగుపరిచాం. 4470 ప్రాథమిక స్కూళ్ల పరిధిలోకి అంగన్వాడీలను తీసుకొచ్చాం.

డ్రాపౌట్స్ తగ్గాయి.. పోషకాహారం కోసం.. నాణ్యమైన ఆహారం, ఆరోగ్య సేవలు

AP Budget 2024 Live Updates : ఏపీ బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌.. :  విదేశీ ఉన్నత విద్యా పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నాం. ఉన్నత విద్యలో 6.62 శాతానికి తగ్గిన డ్రాప్ అవుట్ శాతం. ఏటా 47 లక్షల విద్యార్థులకు ప్రీస్కూల్ కిట్లు పంపిణీ చేస్తున్నాం. 99.81 శాతం స్కూళ్లలో కనీసం మౌలిక సదుపాయాలు అందించాం.

పోషకాహారం కోసం..

రక్తహీనతతో బాధపడే గర్భిణీల సంఖ్య గతంలో కంటే తగ్గింది. పోషకాహారం కోసం గతం కంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఖర్చు చేశాం.

నాణ్యమైన ఆహారం, ఆరోగ్య సేవలు

నాడు నేడు కింద 56,703 స్కూల్స్, కాలేజీల్లో వసతులు మెరుగు పరిచారు. జగనన్న గోరుముద్ద కింద 43 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన ఆహారం. జగనన్న గోరుముద్ద పథకానికి ఏటా రూ. 1910 కోట్లు ఖర్చు. ఫ్యామిలీ డాక్టర్ కింద మండలానికి 108, 104 సర్వీసులు.

అందరికీ సమానంగా పాలన అందాలనే వికేంద్రీకరణ చేశాం : మంత్రి బుగ్గన

AP Budget 2024 Live Updates : ఏపీ బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌..  : వైయస్ రాజశేఖర్ రెడ్డి, అంబేద్కర్ లాంటి దార్శనీకుల ఆలోచనలతో ప్రభుత్వం పాలన సాగిస్తుంది. రాష్ట్ర సమస్యలను పాత మూస పద్ధతులతో కాకుండా సరికొత్త విధానాల్ని అవలంబించాం. పాలన వికేంద్రీకరణ ద్వారా పౌర సేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా ప్రభుత్వ చర్యలు. పాలన విభాగాలను పునర్వ్యవస్థీకరించి అన్ని వర్గాల వారికి సాధికారిక అందించాం. విద్యార్థులను ప్రపంచస్థాయి పోటీకి సిద్ధం చేసేలా ఆంగ్ల మాధ్యమ విద్యను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 1000 పాఠశాలలోని 4,39,395 మంది విద్యార్థులను సిబిఎస్ ఈ పరిధిలోకి తీసుకువచ్చాం. అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఐబి పాఠ్యప్రణాళిక, ప్రతి విద్యార్థికి టోలెఫ్ ధ్రువీకరణ పత్రం అందించేలా ప్రయత్నం. కొత్త పారిశ్రామిక విధానంతో సంపన్న ఆంధ్ర, రీ సర్వే, ల్యాండ్ టైటిలింగ్ చట్టాలతో భూభద్ర ఆంధ్ర ఏపీ మారింది. ఇప్పటివరకు ఎవరు చేయని పనులను ప్రభుత్వం చేసింది. పాలనపరమైన పునర్నిర్మాణంలో భాగంగా 13 కొత్త జిల్లాలు, 26 కొత్త రెవెన్యూ డివిజన్లు, పోలీసు డివిజన్లు ఏర్పాటు.అందరికీ సమానంగా పాలన అందాలనే వికేంద్రీకరణ చేసాం. గడపగడపకు ప్రభుత్వం 2356 కోట్లతో పనులు చేపట్టారు. సామర్ధ్య ఆంధ్ర ద్వారా మానవ వనరులపై పెట్టుబడి పెడుతున్నాం. నాలుగవ తరగతి నుంచి 12వ తరగతి వరకు 34.30 లక్షల మంది విద్యార్థులు ప్రతిభావంతులయ్యారు. నాడు నేడు ద్వారా ఐదేళ్లలో 99.81 శాతం పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు అందించాం. మొత్తం 7163 కోట్ల రూపాయలు ఖర్చు చేసాం. సంపూర్ణ పోషణ గోరుముద్ద పథకాల ద్వారా పోషణ లోపాన్ని 2023 నాటికి 6.84 శాతానికి తగ్గించాం. విదేశీ విద్యా దీవెన ద్వారా 1858 మంది విద్యార్థులకు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యా ఇచ్చాం.

గడపగడపకు మా పాలన

లక్ష 35 వేల మంది ఉద్యోగాలతో గ్రామ సచివాలయాల ఏర్పాటు. రెండున్నర లక్షల మంది వాలంటీర్లతో గడపగడపకు పాలన.

ప్రతి విద్యార్థులకు టోఫెల్ శిక్షణ

ప్రతి విద్యార్థికి టోఫెల్ ధ్రువీకరణ పత్రం ఇచ్చేలా చర్యలు. విద్యా ప్రమాణాల మెరుగు కోసం 9,52,927 టాబ్లెట్ పంపిణీ. 34 లక్షల 30 వేల మంది విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచాం. 1000 స్కూళ్లలో సిబిఎస్ఐ సిలబస్.

మానవ వనరుల అభివృద్ధే లక్ష్యం

మానవ మూలధన అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత. పరిపూర్ణ మానవ వనరుల అభివృద్ధి లక్ష్యంగా సామర్ధ్య ఆంధ్ర.

ఏపీ అసెంబ్లీలో 2024 – 25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్

AP Budget 2024 Live Updates : ఏపీ బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌..  : ఏపీ అసెంబ్లీలో 2024 – 25 బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెడుతున్నారు. మహాత్మా గాంధీ సందేశం తో బడ్జెట్ ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు. ఐదేళ్లుగా బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందని మేనిఫెస్టో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పవిత్ర గ్రంథం గా భావించారని మంత్రి బుగ్గన అన్నారు.

రూ. 2,86,389 కోట్లతో వార్షిక బడ్జెట్

2024- 25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,86, 389 కోట్లతో బడ్జెట్.
– రూ. 2,30,110 కోట్లతో రెవెన్యూ వ్యయం
– రూ. 30,530 కోట్ల మూల ధన వ్యయం
– రూ. 24,758 కోట్ల రెవెన్యూ లోటు
రూ. 55,817 కోట్ల ద్రవ్య లోటు
– రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.51% – జిఎస్ డీపిలో రెవెన్యూ లోటు 1.56%

టీడీపీ ఎమ్మెల్యేలు గందరగోళం సృష్టిస్తున్నారు – మంత్రి చెల్లుబోయిన

AP Budget 2024 Live Updates : ఏపీ బడ్జెట్ 2024 లైవ్ అప్‌డేట్స్‌.. : ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ లో మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ మాట్లాడారు. ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు ఎన్నుకున్నవాళ్లు జవాబుదారీగా పనిచేయాలని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు జరిగిన మంచిని చెప్తుంటే వినలేక వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల్ని ఆదుకోవడంలో వారి పాత్ర శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో కనిపించాలని గందరగోళం చేస్తున్నారన్నారు. విఫల ప్రతిపక్షం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉందా అంటూ ప్రశ్నించారు.

మూడు బిల్లులను ఆమోదించిన ఏపీ అసెంబ్లీ .. మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

1) ఆర్జేయూకేటి విశ్వవిద్యాలయం సవరణ బిల్లు – 2024
2) ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ ( బదిలీ నిషేధ సవరణ) బిల్లు – 2024
3) ఏపీ ఉద్యోగుల నియామకాలు, క్రమబద్ధీకరణ, రేషనైజేషన్ సంబంధిత సవరణ బిల్లు – 2024 ( రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీస్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టాఫ్ పాటర్న్ అండ్ పే స్ట్రక్చర్ సవరణ బిల్లు)

మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం అయింది. 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మంత్రి మండలి ఆమోదించింది. నంద్యాల జిల్లా డోన్ లో కొత్తగా హార్టికల్చరల్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. డాక్టర్ వైయస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ పరిధిలో హార్టికల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల పని చేయనుంది. నంద్యాల జిల్లా డోన్ లో వ్యవసాయ రంగంలో రెండేళ్ల డిప్లమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల పని చేయనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2016 కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీలో 3 ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి లభించింది. రాజంపేటలో అన్నమాచార్య యూనివర్సిటీ, రాజమండ్రిలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్సిటీలో ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 05-02 – 2024 నాడు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ ప్రసంగానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

 

 

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago