Andhra Pradesh Election 2024 schedule : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వ‌చ్చేసింది… పోలింగ్‌, ఫ‌లితాల తేదీలు ఇవే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Andhra Pradesh Election 2024 schedule : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వ‌చ్చేసింది… పోలింగ్‌, ఫ‌లితాల తేదీలు ఇవే..!

 Authored By tech | The Telugu News | Updated on :16 March 2024,4:55 pm

ప్రధానాంశాలు:

  •   Andhra Pradesh Election 2024 schedule : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వ‌చ్చేసింది... పోలీంగ్‌, ఫ‌లితాలు తేదిలు ఇవే..!

Andhra Pradesh Election 2024 schedule :ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైంది. ఏపీలో మే 13న ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా, జూన్ 4న కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. కొద్ది సేప‌టి క్రితం ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ షెడ్యూల్‌ని విడుద‌త‌ల చేసింది. 2024 మార్చి 16న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రెస్ నోట్, ప్రకటన రిలీజ్ చేస్తూ.. ఏప్రిల్ 18న అధికారిక నోటిఫికేషన్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలియ‌జేశారు. నామినేష‌న్ల స్వీక‌ర‌ణ ఏప్రిల్ 15గా చెప్పారు. ఇక 26 ఏప్రిల్ న నామినేషన్ల స్క్రూనిటీ జరగనుంది. అభ్యర్థుల ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 29గా ప్రకటించింది.

ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో నేటి నుంచే ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిన‌ట్టు తెలియ‌జేశారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఈ కోడ్ వర్తించనుండ‌గా, రాజకీయ పార్టీలు, నేతలు తప్పనిసరిగా ఎల‌క్ష‌న్ కోడ్ పాటించాల్సి ఉంటుంది. ఇది ఎవ‌రైన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నామినేషన్లు ప్రారంభం – ఏప్రిల్ 18న కాగా, నామినేషన్ల చివరి తేదీ – ఏప్రిల్ 25, నామినేషన్ల పరిశీలన – ఏప్రిల్ 26, నామినేషన్ల ఉపసంహరణ – ఏప్రిల్ 29, పోలింగ్‌ తేదీ – మే 13, ఎన్నికల ఫలితాలు – జూన్ 4గా తెలియ‌జేశారు.

ఏపీలో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌లు 2019లో జరిగాయి. ఆ ఎన్నిక‌ల‌లో టీడీపీ, జ‌న‌సేన పొత్తులేదు. దీంతో వైసీపీ ఘన విజయం సాధించగా టీడీపీ ప్రతిప‌క్షానికి పరిమిత‌మైన విష‌యం మ‌న‌కు తెలిసిందే. భారీ మెజార్టీ వైసీపీకి రాగా వాళ్లు ఐదు ఏళ్లు ప‌ని చేశారు. అయితే ఈ సారి కూడా జ‌గ‌న్ గెలుస్తాడ‌ని గ‌ట్టిగా చెబుతున్నారు. మ‌రోవైపు టీడీపీ-జ‌న‌సేన‌- బీజేపీ పొత్తులో ఉండ‌గా, మా ప్ర‌భుత్వ‌మే అధికారంలోకి వ‌స్తుంద‌ని అంటున్నారు. టీడీపీ జనసేన బీజేపీలతో కూడిన కూటమి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న నేప‌థ్యంలో ఈ ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు వాడీ వేడీగా సాగనున్నాయి.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది