Pawan Kalyan : పవన్ రిక్వెస్ట్ చేస్తే.. పంపకుండా ఉంటారా..!!
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌లో అడవి ఏనుగుల బెడదను నియంత్రించేందుకు కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి మేరకు ఈ నెల 21వ తేదీన బెంగళూరులో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆరు కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఏపీకి అందించనుంది. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే పాల్గొననున్నారు. ఏపీ తరఫున అటవీ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
రంజన్, దేవా, మాస్తి, కరుణ, కృష్ణ, అభిమన్యు అనే ఆరు కుంకీ ఏనుగులను కొడగు జిల్లాలోని దుబారె ఎలిఫెంట్ క్యాంప్ మరియు శివమొగ్గ జిల్లా సక్రెబైలు ప్రాంతాల నుంచి ఏపీకి తరలించనున్నారు. మొదట వీటిని చిత్తూరు జిల్లాకు తీసుకువెళతారు. ఈ కుంకీ ఏనుగులు అడవి ఏనుగుల గుంపులను నియంత్రించగలిగే సామర్థ్యం కలిగినవిగా గుర్తించబడ్డాయి. శ్రీకాకుళం, విజయనగరం, తిరుపతి, అల్లూరి, చిత్తూరు వంటి జిల్లాల్లో అడవి ఏనుగుల విరాళాలు పెరిగిన నేపథ్యంలో వీటిని నియంత్రించేందుకు ఈ ప్రత్యేక కుంకీ ఏనుగులు ఉపయోగపడనున్నాయి.
Pawan Kalyan : పవన్ రిక్వెస్ట్ చేస్తే.. పంపకుండా ఉంటారా..!!
ఈ ఏనుగులతో పాటు వాటిని శిక్షణ ఇచ్చిన మావటులు కూడా ఏపీకి వస్తారు. కొద్ది రోజులు ఈ ప్రాంతంలో ఉండి, ఏనుగులు వాతావరణానికి అలవాటు పడేలా చేస్తారు. అదే సమయంలో అటవీ శాఖ సిబ్బందికి శిక్షణనిచ్చి, నియంత్రణా పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. అనంతరం మావటులు తిరిగి కర్ణాటకకు వెళ్లనున్నారు. అయితే కర్ణాటకలోనే ఏనుగుల విరాళాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుండగా, ఆ రాష్ట్రం కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వడం పట్ల కొంత విమర్శలు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఇవి ఏ మేరకు ఏనుగుల గుంపును అరికట్టగలవో..!!
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
This website uses cookies.