Pawan Kalyan : పవన్ రిక్వెస్ట్ చేస్తే.. పంపకుండా ఉంటారా..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : పవన్ రిక్వెస్ట్ చేస్తే.. పంపకుండా ఉంటారా..!!

 Authored By ramu | The Telugu News | Updated on :19 May 2025,11:00 am

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌లో అడవి ఏనుగుల బెడదను నియంత్రించేందుకు కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి మేరకు ఈ నెల 21వ తేదీన బెంగళూరులో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆరు కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఏపీకి అందించనుంది. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే పాల్గొననున్నారు. ఏపీ తరఫున అటవీ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

రంజన్, దేవా, మాస్తి, కరుణ, కృష్ణ, అభిమన్యు అనే ఆరు కుంకీ ఏనుగులను కొడగు జిల్లాలోని దుబారె ఎలిఫెంట్ క్యాంప్ మరియు శివమొగ్గ జిల్లా సక్రెబైలు ప్రాంతాల నుంచి ఏపీకి తరలించనున్నారు. మొదట వీటిని చిత్తూరు జిల్లాకు తీసుకువెళతారు. ఈ కుంకీ ఏనుగులు అడవి ఏనుగుల గుంపులను నియంత్రించగలిగే సామర్థ్యం కలిగినవిగా గుర్తించబడ్డాయి. శ్రీకాకుళం, విజయనగరం, తిరుపతి, అల్లూరి, చిత్తూరు వంటి జిల్లాల్లో అడవి ఏనుగుల విరాళాలు పెరిగిన నేపథ్యంలో వీటిని నియంత్రించేందుకు ఈ ప్రత్యేక కుంకీ ఏనుగులు ఉపయోగపడనున్నాయి.

Pawan Kalyan పవన్ రిక్వెస్ట్ చేస్తే పంపకుండా ఉంటారా

Pawan Kalyan : పవన్ రిక్వెస్ట్ చేస్తే.. పంపకుండా ఉంటారా..!!

ఈ ఏనుగులతో పాటు వాటిని శిక్షణ ఇచ్చిన మావటులు కూడా ఏపీకి వస్తారు. కొద్ది రోజులు ఈ ప్రాంతంలో ఉండి, ఏనుగులు వాతావరణానికి అలవాటు పడేలా చేస్తారు. అదే సమయంలో అటవీ శాఖ సిబ్బందికి శిక్షణనిచ్చి, నియంత్రణా పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. అనంతరం మావటులు తిరిగి కర్ణాటకకు వెళ్లనున్నారు. అయితే కర్ణాటకలోనే ఏనుగుల విరాళాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుండగా, ఆ రాష్ట్రం కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వడం పట్ల కొంత విమర్శలు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఇవి ఏ మేరకు ఏనుగుల గుంపును అరికట్టగలవో..!!

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది