New Houses : పేదలకు సీఎం గుడ్ న్యూస్.. ఇళ్ల నిర్మాణాలు, గృహప్రవేశాల పై కీలక ప్రకటన ..!

 Authored By sudheer | The Telugu News | Updated on :8 April 2026,10:30 am

ప్రధానాంశాలు:

  •  New Houses : పేదలకు సీఎం గుడ్ న్యూస్.. ఇళ్ల నిర్మాణాలు, గృహప్రవేశాల పై కీలక ప్రకటన ..!

New Houses : ఆంధ్రప్రదేశ్‌లో పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ఏడాదిలోనే మరోసారి సామూహిక గృహప్రవేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం రాష్ట్రంలో సుమారు 2 లక్షల మంది ఇళ్ల స్థలాలు కోరినట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో గృహనిర్మాణంతో పాటు స్థలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరును సమీక్షించిన సీఎం ప్రజలకు త్వరితగతిన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్ష అనంతరం రూపొందించిన “అవేర్ 2.0” మొబైల్ యాప్‌ను ప్రారంభించడం ద్వారా ప్రజలకు సమాచారాన్ని వేగంగా చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Another 5 lakh people in AP will get housing benefits

Another 5 lakh people in AP will get housing benefits

New Houses : టిడ్కో ఇళ్లు, ఇసుక సరఫరా, భద్రతపై సూచనలు

రాష్ట్రంలో ఇప్పటికే చేపట్టిన టిడ్కో ఇళ్లకు అదనంగా మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేసి లబ్ధిదారులకు అందించాలని సీఎం పేర్కొన్నారు. వర్షాకాలంలో ఇసుక సరఫరాలో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నందున ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇసుకను అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిఘాను పెంచాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలో పిడుగుల ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ముందస్తుగా మొబైల్ సందేశాల ద్వారా హెచ్చరికలు పంపుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిడుగులు పడే ప్రాంతాల్లో టవర్ లొకేషన్ ఆధారంగా నెట్‌వర్క్ ద్వారా సమాచారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.

New Houses : విద్య, అగ్నిమాపక శాఖ ఆధునీకరణ, పెట్టుబడులపై దృష్టి

రాష్ట్రంలో ఉన్నత విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయాలని సీఎం పేర్కొన్నారు. యూనివర్సిటీలతో సమన్వయం పెంచుతూ, ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. సంప్రదాయ కోర్సులతో పాటు డిమాండ్ ఉన్న రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, కొత్త కరిక్యులమ్‌ను రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా అమరావతి పరేడ్ గ్రౌండ్‌లో అగ్నిమాపక శాఖకు సంబంధించిన నూతన వాహనాలు, పరికరాలను ప్రారంభించారు. రూ.252.93 కోట్లతో శాఖను ఆధునీకరించగా, రూ.33.25 కోట్ల విలువైన వాహనాలు మరియు పరికరాలు సమకూర్చారు. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు జరిగిన 16వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశానికి సీఎం అధ్యక్షత వహించారు. పరిశ్రమలు, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలపై చర్చలు జరిగాయి. రాష్ట్ర అభివృద్ధికి ఈ నిర్ణయాలు కీలకమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి