CM Chandrababu : కుటుంబానికి రూ. 1.5 లక్షల రుణమాఫీ .. రైతులకు సీఎం బంపర్ ఆఫర్ ..!

Authored By Sudheer Ramanujam | The Telugu News | Published on: April 20, 2026, 1:30 pm
  •  CM Chandrababu : కుటుంబానికి రూ. 1.5 లక్షల రుణమాఫీ .. రైతులకు సీఎం బంపర్ ఆఫర్ ..!

CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక ప్రకటనలు చేశారు. జూన్ నాటికి రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో చెత్తను శాతం వందకు తొలగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. గత 15 నెలలుగా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నామని, ఈసారి “జలధార–జల హారతి” థీమ్‌తో ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని వివరించారు. పూర్వ పాలకుల నిర్లక్ష్యంతో రాష్ట్రం చెత్తతో నిండిపోయిందని విమర్శించిన ఆయన 603 కోట్ల రూపాయలతో 107 ఆధునిక చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అక్టోబర్ నాటికి ఇవన్నీ అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. అలాగే ఈ ఏడాది డిసెంబర్ లోపు 7.14 లక్షల కిచెన్ గార్డెన్లు, లక్ష సోక్ పిట్స్, 8 వేల కమ్యూనిటీ సోక్ పిట్స్, 100 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

CM Chandrababu's bumper offer for farmers

CM Chandrababu’s bumper offer for farmers

CM Chandrababu : రైతులు, సంక్షేమం, రాజకీయ విమర్శలు

అమరావతి భూసమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. వార్షిక కౌలు పెంపునకు సీఎం ఆమోదం తెలుపగా ఎకరానికి 40 వేల చొప్పున పదేళ్లపాటు చెల్లిస్తామని ప్రతి ఏడాది 3 వేల చొప్పున పెంపు ఉంటుందని తెలిపారు. కుటుంబానికి రూ.1.5 లక్షల వ్యవసాయ రుణమాఫీ కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నందుకు కాంగ్రెస్ కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌లో జరిగినది దేశ చరిత్రలో నల్లరోజు అని అభివర్ణించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించిన సీఎం ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించి స్వయంగా పేదలకు భోజనం వడ్డించారు. ఆకలి లేని సమాజమే నిజమైన అభివృద్ధికి సూచిక అని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు ప్రారంభమై మొత్తం సంఖ్య 269కి చేరినట్లు తెలిపారు. గత 21 నెలల్లో 8.80 కోట్ల భోజనాలు అందించామని దీనికి రూ.243 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.

CM Chandrababu : సమీక్షలు, ప్రాజెక్టులు, సాంకేతిక పురోగతి

మలకోడు సరస్సు పునరుద్ధరణ పనులను పరిశీలించిన సీఎం వాకింగ్ ట్రాక్ అభివృద్ధి ప్రణాళికపై అధికారులతో చర్చించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమ పురోగతిపై సమీక్ష నిర్వహిస్తూ ఇంటింటికీ చెత్త సేకరణ, ప్రాసెసింగ్ పూర్తి స్థాయిలో జరగాలని ఆదేశించారు. హాస్టళ్లు, పాఠశాలల్లో పరిశుభ్రత, సోలార్ సదుపాయాలు, గ్రీనరీ పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలో పోలవరం సహా కీలక ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయాలని ఆదేశించారు. గోదావరి జలాల వినియోగానికి సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలని పేర్కొన్నారు. అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించడం ద్వారా సాంకేతిక రంగంలో రాష్ట్రం ముందడుగు వేసిందన్నారు. ఆర్థిక శాఖ సమీక్షలో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. టెక్నాలజీ ఆధారిత పాలనకు ప్రాధాన్యత ఇస్తూ నిబంధనలను సరళీకరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర బృందంతో భేటీలో పరిశ్రమల స్థాపనలో వేగం, పారదర్శకతపై చర్చించారు. ఇక స్వచ్ఛత, సంక్షేమం, సాంకేతిక పురోగతి, వ్యవసాయం వంటి అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

Sudheer Ramanujam

Sudheer Ramanujam Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp