Jagan : ఏపీలో ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ వైసీపీ అధినేత సీఎం జగన్ సిద్ధం సభలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. అంతేకాక జగన్ సిద్ధం సభలకు ప్రతి చోట ప్రజలందరూ జననీరాజనం పలుకుతున్నారు. ఇది ఇలా ఉంటే ఒంటరిగా జగన్ ను ఎదుర్కోవడం కష్టమని భావించిన విపక్ష పార్టీలు టీడీపీ జనసేన పోత్తుగా కలిసి ముందుకు వెళుతున్నాయి. ఇక ఈ పొత్తులో బీజేపీ కూడా ఉంటుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా ప్రముఖ జాతీయ సంస్థలు తాజాగా విడుదల చేసిన సర్వేలో కూడా అధికార వైసీపీ పార్టీకి ఫలితాలు అనుకూలంగా వస్తున్నాయి.
అయితే ఇప్పటికే టైమ్స్ నౌ , ఇండియా టీవీ, ఫుల్ స్ట్రాటజీ , పొలిటికల్ క్రిటిక్ వంటి సంస్థలు చేపట్టిన సర్వేలలో కూడా వైసీపీ పార్టీకి ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. అంతేకాక గ్రామీణ మరియు పట్టణ ప్రాంత ప్రజలు కూడా వైసీపీ పార్టీని గెలిపించేందుకే సిద్ధమవుతున్నారని సర్వేలో వెళ్లడైంది.
అయితే ఒకవైపు అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలతో ఆంధ్ర రాష్ట్రంలో వైసీప పార్టీ చాలా బలంగా ఉందని ఇక ఇప్పుడు జరగబోయే 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ పార్టీకే అధికారం చేపడుతుందంటూ సర్వేలు తెలియజేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తాజాగా జీ న్యూస్ సంస్థలతో పాటు మరో ప్రముఖ సంస్థ చేసినటువంటి సర్వేలో వచ్చిన ఫలితాలు టీడీపీ మరియు జనసేన నేతలలో గుబులు పుట్టిస్తున్నాయని చెప్పాలి. అయితే తాజాగా ఆంధ్ర రాష్ట్రంలో జీ న్యూస్ మరియు మ్యాట్రిజ్ సంస్థ చేసిన సర్వే ప్రకారం రాష్ట్రంలో 25 లోక్ సభ స్థానాలలో వైసీపీ పార్టీ 19 స్థానాలను సాధిస్తుందని తెలియజేశాయి. అయితే వైసీపీ పార్టీ గత ఎన్నికల్లో 22 లోక్ సభ స్థానాలు దక్కించుకోగా ఈసారి 3 స్థానాలు తగ్గే అవకాశం ఉన్నట్లు సర్వేలు తెలిపాయి. అదేవిధంగా తెలుగుదేశం మరియు జనసేన కూటమి 6 స్థానాలకు పరిమితమవుతుందని అంచనా వేశాయి.
అంతేకాక ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలలో వైసీపీ కాంగ్రెస్ పార్టీపై అసలు వ్యతిరేకత లేదని తెలియజేస్తున్నాయి. అంతేకాక సంక్షేమ పథకాలను వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి కి వెళ్లి అందిస్తుండడంతో ప్రజలందరూ కూడా జగన్ పాలన పైపే ఆసక్తి చూపిస్తున్నట్లుగా సర్వేలు పేర్కొంటున్నాయి. ఈ లెక్క ప్రకారం చూసినట్లయితే వైసీపీ 133 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందట. అలాగే వైసీపీకి 48% ఓట్ షేర్ టీడీపీ జనసేనకు 44% ఓట్ షేర్ వస్తుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. అదేవిధంగా జనాధర్ ఇండియా సర్వే కూడా వైసీపీ పార్టీకి అధికారం ఖాయమని తెలియజేస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం వైసీపీ పార్టీకి 125 సీట్లు , టీడీపీ జనసేన కూటమికి 50 సీట్లు వస్తాయని తెలిపింది. ఇలా ఆంధ్ర రాష్ట్రంలో చేపట్టిన ప్రతి సర్వేలో కూడా వైసీపీ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావడంతో వైసీపీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.