Political : చదవకున్నా పాస్ చేయమనే ఈ దిక్కుమాలిన రాజకీయం ఏంటో…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Political : చదవకున్నా పాస్ చేయమనే ఈ దిక్కుమాలిన రాజకీయం ఏంటో…!

 Authored By prabhas | The Telugu News | Updated on :11 June 2022,6:00 am

Political : ఏపీలో కాదేది రాజకీయానికి అనర్హం అన్నట్లుగా పరిస్థితి ఉంది. అధికార పార్టీ ఏ పని చేసినా కూడా దాన్ని రాజకీయంగా విమర్శించి పబ్బం గడుపుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు అయిన తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీ లు ప్రయత్నాలు చేస్తున్నాయి. అభివృద్ది జరిగితే అడ్డగోలు విమర్శలు.. సంక్షేమ పథకాలపై అడ్డమైన పుకార్లు పుట్టించడంతో పాటు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పార్టీలు దారుణంగా వ్యవహరిస్తున్నాయి. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలు మరో అడుగు ముందుకు వేసినట్లుగా వ్యవహరించాయి.

ఇటీవల పదవ తరగతి పరీక్ష ఫలితాలు వచ్చాయి. గతంలో మాదిరిగా మాస్ కాపీయింగ్‌ కు పాల్పడకుండా.. పేపర్‌ కరెక్షన్‌ లో ఎలాంటి లోపాలు లేకుండా చూడటం తో పాస్ పర్సంటేజ్ తగ్గింది. ఇలా పాస్ పర్సంటేజ్ తగ్గిన సమయంలో విద్యార్థుల యొక్క మౌళిక వసతులు పెంచాలి.. వారికి మంచి విద్యను అందించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేయాలి. కాని దిక్కుమాలిన కొందరు రాజకీయ నాయకులు మాత్రం ఫెయిల్‌ అయిన వారిని పాస్ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. చదవకుండా ఫెయిల్‌ అయిన పిల్లలకు ప్రత్యేక క్లాస్ లు ఏర్పాటు చేసి..

ap 10th class results tdp and janasena Political Stunts

ap 10th class results tdp and janasena Political Stunts

వారికి పరీక్షలు పెట్టి మొదట పాస్ అయిన విద్యార్థులతో కలిసే విధంగా ఏపీ ప్రభుత్వం ఒక వైపు ఏర్పాట్లు చేస్తూ ఉంటే.. మరో వైపు మాత్రం విపక్ష పార్టీలు నానా రచ్చ చేస్తున్నారు. పిల్లలతో మాట్లాడుతూ.. వారిని మీడియా ముందుకు తీసుకు వచ్చి ప్రభుత్వాన్ని తిట్టిస్తున్నారు. వారు చదవకుండా ఫెయిల్‌ అయితే వారిని పాస్ చేయమని అడగడం సిగ్గు చేటు. అయినా చదవకున్నా పాస్ చేస్తే వారు తర్వాత ఏం అవుతారు.. ఎక్కడికి ఈ సమాజం వెళ్తుంది అంటూ వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది