Ap Elections : వైసీపీ ఎన్నికల సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి.. ఏపీ ఎన్నికలలో ఏం జరగనుంది అంటే..!
ప్రధానాంశాలు:
Ap Elections : వైసీపీ ఎన్నికల సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి.. ఏపీ ఎన్నికలలో ఏం జరగనుంది అంటే..!
Ap Elections : మరి కొద్ది రోజులలో ఏపీలో ఎన్నికలు జరగనుండగా, ఈ సారి ఏ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందనే సర్వే మొదలైంది. మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలని వైసీపీ భావిస్తుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం బహిరంగ సభలతో జనంలోకి చొచ్చుకెళ్లింది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా నాలుగు చోట్ల బహిరంగ సభలను నిర్వహించడంతో పాటు మలిదశలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు జిల్లాలలో పర్యటన చేశారు. ఇక ఈ నెల 27వ తేదీన మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను చేపట్టనుండగా, ఆయన దాదాపు 175 నియోజవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్‌ను కూడా సిద్ధం చేసినట్టు టాక్ వినిపిస్తుంది.
అయితే వైసీపీ ఎప్పటికపుడు అంతర్గత సర్వేలు చేయిస్తుంటుంది. కాని వాటికి సంబంధించి కొన్ని విషయాలు బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలో వైసీపీ సర్వేలను చూసుకునే అభ్యర్ధుల మార్పుచేర్పులు చేసింది. సర్వేల ఆధారంగా చేసుకుని పొలిటికల్ యాక్టివిటీని డిజైన్ చేస్తుండగా,తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.వైసీపీ సిట్టింగులను మార్చి కొత్త వారికి చోటు కల్పించిన నియోజకవర్గాల్లో ఏమాత్రం సరైన ప్రతిభ కనబరచడం లేదని ఓ నివేదిక చెబుతుంది . ఇక లోకల్ గా ఉండే సీనియర్ లీడర్స్ ని మార్చిన అభ్యర్థులు కనీసం కలవడం లేదని కూడా చెబుతున్నారు.
జగన్ సంక్షేమ పథకాల ద్వారా వైసీపీ జనాలలోకి వెళుతుందే తప్ప నాయకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ లేదంటున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు కూడా నెగెటివ్‌గా ఉన్నారని సమాచారం వారి విషయం లో చొరవ తీసుకుని దారికి తెచ్చుకునే ప్రయత్నాలు కూడా చేయడం లేదని టాక్. జగన్ ఒక్కరే గేమ్ చేంజర్ గా పార్టీలో కనిపిస్తున్నారు తప్ప మిగతా వారిపై ఏ మాత్రం పాజిటివ్ ఒపినియన్ లేదని సమాచారం. ఇక జగన్ అన్ని నియోజకవర్గాలను కవర్ చేస్తేనే ఏమైన పాజిటివ్ స్పందన వచ్చే అవకాశం ఉందని టాక్.