AP Budget 2024-25 : ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2,94,427.25 కోట్లు.. శాఖల వారీగా కేటాయింపులు
ప్రధానాంశాలు:
AP Budget 2024-25 : ఏపీ వార్షిక బడ్జెట్ రూ. 2,94,427.25 కోట్లు.. శాఖల వారీగా కేటాయింపులు
AP Budget 2024-25 : ఏపీ వార్షిక బడ్జెన్‌ను ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ. 2,94,427.25 కోట్లతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సంక్షేమ కార్యక్రమాలకు భారీగా కేటాయింపులు చేస్తూ టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ప్రభుత్వ తొలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి రూపొందించారు. ఈ మెగా బడ్జెట్ లో రెవెన్యూ వ్యయం రూ.2.35 లక్షల కోట్లు. మూలధన వ్యయం రూ. 32,712 కోట్లు కాగా 68,742 కోట్ల రెవెన్యూ లోటును ఏపీ ప్రభుత్వం నిర్వహించాలి.
బడ్జెట్ ప్రవేశం సందర్భంగా ఆర్థిక మంత్రి ప్రసంగిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 2019 మరియు 2024 మధ్య నాశనం చేయబడిందన్నారు. తాము ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించాలని మరియు సిఎం నారా చంద్రబాబు నాయుడు దార్శనిక నాయకత్వంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాలలో ఒకటిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అభివృద్ధిలో రాజీపడకుండా అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు చెప్పారు.
AP Budget 2024-25 AP బడ్జెట్ 2024-25 నివేదిక ప్రకారం, వివిధ మంత్రిత్వ శాఖలకు కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి.
బీసీ సంక్షేమం : రూ. 39,007 కోట్లు
పాఠశాల విద్య : రూ. 29,909 కోట్లు
ఎస్సీ సంక్షేమం : రూ. 18, 497 కోట్లు
ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం : రూ. 18,421 కోట్లు
పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి : రూ. 16,739 కోట్లు
నీటి వనరులు : రూ. 16,705 కోట్లు
వ్యవసాయం మరియు అనుబంధ పరిశ్రమలు : రూ. 11,855 కోట్లు
పట్టణాభివృద్ధి : రూ. 11,490
రవాణా, రోడ్లు మరియు భవనాలు : రూ.9,554Cr
ఎస్టీ సంక్షేమం : రూ. 7,557 కోట్లు
మైనారిటీల సంక్షేమం : రూ. 4,376 కోట్లు
స్త్రీలు మరియు శిశు సంక్షేమం : రూ. 4,285 కోట్లు
హౌసింగ్ : రూ. 4,012 కోట్లు
పరిశ్రమలు మరియు వాణిజ్యం : రూ. 3,127 కోట్లు
ఉన్నత విద్య : రూ 2326
మానవ వనరుల అభివృద్ధి : రూ.1215 కోట్లు
యువత, పర్యాటకం మరియు సంస్కృతి : రూ 322 కోట్లు
వ్యవసాయ బడ్జెట్ రూ. 43,402 కోట్లు : ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఏపీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, వ్యవసాయ శాఖ మంత్రి కే అచ్చెన్నాయుడు 2024-25 వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పించారు. రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇస్తున్న అధిక ప్రాధాన్యతను పేర్కొంటూ 43,402 కోట్ల రూపాయలతో వ్యవసాయ బడ్జెట్‌ను సీనియర్ మంత్రి సమర్పించారు.