AP CM YS Jagan : ఏపీ ప్రజలకు సీఎం జగన్ గుడ్ న్యూస్.. తక్కువ వడ్డీకే రుణాలు.. బంపర్ ఆఫర్
AP CM YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. సహకార శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సహకార బ్యాంకులు మన బ్యాంకులని.. వాటిని ఖచ్చితంగా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
సహకార బ్యాంకులు.. ఇతర బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే ప్రజలకు రుణాలు అందిస్తాయని.. అందుకే.. తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే ప్రజలకు, రైతులకు ఈ బ్యాంకుల వల్ల చాలా మేలు జరుగుతుందని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
AP CM YS Jagan : వెసులుబాటు ఉన్నంత వరకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వండి
అందుకే.. సహకార బ్యాంకులకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం ఉంటుందని చెప్పిన సీఎం జగన్.. రైతులకు, ప్రజలకు వెసులుబాటు ఉన్నంత వరకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వండి అని ఆదేశించారు.
డీసీసీబీ బ్యాంకులు, సహకార బ్యాంకులు.. బ్యాంకింగ్ రంగంలో ఉన్న పోటీని ఎదుర్కొనేలా ఉండాలి. ఆ బ్యాంకులు ఎంత పటిష్టంగా ఉంటే.. రైతులకు అంత మేలు. బంగారంపై కూడా తక్కువ వడ్డీకే సహకార బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. వ్యవసాయం రంగంలోనే విప్లవాత్మక మార్పులను తాము తీసుకొచ్చాం. వాటిని బ్యాంకులు వినియోగించుకొని ప్రజలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.