CM Jagan : జగన్ మోహన్ రెడ్డి బలం – బలగం ఇదే !
CM Jagan : అవును.. జగన్ బలవంతుడే. చాలా బలవంతుడు. అందుకే ఆయన బడుగు, బలహీన వర్గాలకు వెన్ను తట్టి తోడుగా నిలుస్తున్నారు.. అంటూ ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కొనియాడారు. సీఎం జగన్ ను మంత్రి పొగడటంలో వింతేమీ లేదు కానీ.. ఏపీలో ప్రస్తుత పాలన చూసి ప్రజలు కూడా అదే అంటున్నారు. నిజంగానే సీఎం జగన్ బలవంతుడు. ఈ రాష్ట్ర ప్రజలే ఆయన బలం, బలగం. ప్రస్తుతం ఏపీలోని ప్రతి గడపలో ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందుతున్నవారే. అందుకే.. ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు..
జగన్ మోహన్ రెడ్డిని బలవంతుడు అంటూ చెప్పుకొచ్చారు. దానికి కారణం కూడా చెప్పుకొచ్చారు. హామీలు అందరూ ఇస్తారు కానీ.. వాటిని నెరవేర్చేది ఎంతమంది. మాటలు చెప్పడం అందరికీ తెలుసు కానీ.. చేతలకు వచ్చే వరకు ఎంతమంది వాటిని నెరవేర్చుతారు. ఎంతమంది మాట మీద నిలబడతారు. కొత్త ముఖ్యమంత్రి. యువకుడు, పరిపాలన అనుభవం కూడా లేదు. అయినా కూడా సీఎం జగన్ గత నాలుగేళ్లలో ఏపీని నెంబర్ వన్ గా తీర్చిదిద్దారు. సామాజిక న్యాయాన్ని చేసి చూపిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవులను పెద్దలకే అనే పరిస్థితిని మార్చేశారు.
CM Jagan : జగన్ గట్స్ కి సలామ్ కొట్టాల్సిందే
తన రాజకీయ సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ.. సామాజిక న్యాయాన్ని అలవాటు చేసుకున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నవాళ్లలో ఎక్కువ మంది బలహీన వర్గాలకు చెందినవారే, అందుకే.. జగన్ బలవంతుడు అని.. బలహీనవర్గాలను ఆదుకుంటున్న జగన్ అని ధర్మాన ప్రసాదరావు కొనియాడారు. ఏ ప్రాంతంలో చూసుకున్నా సామాజిక న్యాయాన్ని ఆయన అవలంబిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చూసినా బీసీలకు, మహిళలకు ఆయన పెద్ద పీట వేస్తున్నారు. వాళ్లలో చాలామందికి ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చారు జగన్. అందుకే.. ఏపీ ప్రజలు మొత్తం జగన్ వైపే ఉన్నారన్నారు.