YS Jagan : సీఎం కేసీఆర్‌కి సెల్యూట్ చేసిన వైఎస్ జగన్.. ఎందుకో తెలిస్తే శభాష్ అంటారు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

YS Jagan : సీఎం కేసీఆర్‌కి సెల్యూట్ చేసిన వైఎస్ జగన్.. ఎందుకో తెలిస్తే శభాష్ అంటారు

 Authored By kranthi | The Telugu News | Updated on :14 October 2023,4:00 pm

YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ గురించి తెలుసు కదా. ఆయన ఒక పట్టాన ఎవ్వరినీ మెచ్చుకోరు. ఒకరిని మెచ్చుకున్నారు అంటే దాని వెనుక ఏదో ఉందనే అనుకోవాలి. తాజాగా సీఎం జగన్.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు సెల్యూట్ చేశారు. ఎందుకో తెలుసా? తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రమే కాదు.. తెలంగాణ పోలీసులను కూడా పొగడ్తల్లో ముంచెత్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన గొప్ప పనులకు సీఎం జగన్ సెల్యూట్ కొట్టారు. ఆ మధ్య హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటనపై సీఎం జగన్ మాట్లాడారు. హ్యాట్సాఫ్ టు కేసీఆర్ గారు అంటూ పోలీసు ఆఫీసర్లు అంటూ చెప్పుకొచ్చారు. దిశ ఘటన అనేది చాలా దురదృష్టకరం. సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అది. ఒక అమ్మాయి డాక్టర్.. 26 ఏళ్ల వయసు చిన్నారి. పాపం.. టోల్ గేట్ దగ్గర టోల్ కట్టడం కోసం బైక్ దిగితే నలుగురు వచ్చి బైక్ ను పంక్షర్ చేసి ఆమెను అక్కడే ఉండేట్టుగా చేసి ఆ పంక్షర్ రిపేర్ చేస్తామని చెప్పి పక్కకు తీసుకెళ్లి రేప్ చేసి కాల్చేసి చేసిన ఘటన మన కళ్ల ముందు కనిపిస్తోందన్నారు.

పోలీసులు ఎలా స్పందించాలి. రాజకీయ నాయకులు ఎలా స్పందించాలి అధ్యక్షా. నిజంగా ఎలా స్పందించాలో ఆలోచన చేస్తే నాకు కూడా తెలిసింది ఈ విషయం గురించి. నాకు కూడా బాధ అనిపించింది. ఇటువంటి ఘటన మన రాష్ట్రంలో జరిగితే మనం ఎలా స్పందించాలి. మన పోలీసులు ఎలా స్పందించాలి అని మనకు మనం ఆలోచించుకోవాలి. ఆ తల్లిదండ్రుల ఆవేదన చూసిన తర్వాత వాళ్లకు కాల్చేసినా తప్పు లేదు అని అందరూ అనుకున్నారు. నాకూ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. నాకు చెల్లెలు ఉంది. నాకు భార్య ఉంది. ఆడపిల్లలు ఉన్నారు. ఎవరైనా ఏదైనా జరిగితే.. వాళ్లకు ఏదైనా జరిగితే ఒక తండ్రిగా నేను ఎలా స్పందించాలి.. వాళ్లకు ఏ రకమైన శిక్ష పడితే నాకు ఉపశమనం జరుగుతుంది అన్నారు.

ap cm ys jagan praises telangana cm kcr

#image_title

YS Jagan : ఎన్ కౌంటర్ జరగడమే కరెక్ట్

తప్పు జరిగింది అని మీడియా కూడా గొప్పగా చూపించాయి. తర్వాత తెలంగాణ ప్రభుత్వం.. హేట్సాఫ్ టు తెలంగాణ ప్రభుత్వం.. తెలంగాణ సీఎం కేసీఆర్, పోలీసులు అని చెబుతున్నాను. వెంటనే రియాక్ట్ అయి జరగకూడని పరిస్థితుల్లో ఎన్ కౌంటర్ జరిగింది అధ్యక్ష. అదే సినిమాల్లో అయితే మనం చప్పట్లు కొడతాం. ఇదే నిజ జీవితంలో ఒక దమ్ము ఉన్నవాళ్లు ఇలా చేస్తే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అట వచ్చి తప్పు అట.. జరగకూడదట.. అంటూ నిలదీస్తున్న పరిస్థితి చూస్తున్నం అధ్యక్ష అంటూ సీఎం జగన్ చెప్పుకొచ్చారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది