AP CM YS Jagan : తగ్గేదేలే అంటున్న సీఎం జగన్.. ఆ సీనియర్ నేత ఖేల్ ఖతం.. పార్టీలో ప్రక్షాళన షురూ
AP CM YS Jagan : రాజకీయాలు అంటేనే అంతే బాస్. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. రాత్రికి రాత్రే అన్నీ మారిపోతుంటాయి. ప్రభుత్వాలే రాత్రికి రాత్రి కూలిపోతుంటాయి. అందుకే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించరు. ఊహించలేరు. ఏపీలో వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ సమాయత్తం అవుతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కూడా ఇప్పటి నుంచే ఎన్నికలకు వ్యూహాలు రచిస్తోంది. పార్టీలో సీఎం జగన్ ప్రక్షాళన స్టార్ట్ చేశారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్
నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు చెక్ పెట్టేందుకు సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అదెలా అంటే.. ప్రస్తుతం కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. చంద్రబాబునాయుడు.. కన్నాకు సత్తెనపల్లి నియోజకవర్గం టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అనే విషయం తెలుసు కదా. ఆయన ఏపీ మంత్రి. తాజాగా.. అదే సత్తెనపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వర రెడ్డి వైసీపీలో చేరారు. వాళ్లను వైసీపీలోకి చేర్చుకున్నదే కన్నాకు చెక్ పెట్టడానికి అనే టాక్ వినిపిస్తోంది.
AP CM YS Jagan : తన కొడుకుతో కలిసి వైసీపీలో చేరిన యర్రం
తన కొడుకు నితిన్ రెడ్డితో కలిసి యర్రం వెంకటేశ్వర రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. వీళ్లు అధికారికంగా వైసీపీలో త్వరలోనే చేరనున్నారు. సత్తెనపల్లి నుంచి ఈసారి అంబటికి టికెట్ రాకపోతే.. యర్రం వెంకటేశ్వర రెడ్డికి సీఎం జగన్ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కన్నాకు చెక్ పెట్టాలంటే సీఎం జగన్ కు మరో పాపులర్ నేత కావాలి. అందుకే యర్రం వెంకటేశ్వర్ రెడ్డిని వైసీపీలో చేర్చుకునేందుకు జగన్ సన్నాహాలు చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తాజాగా మళ్లీ ఆయన రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ఈసారి కన్నాకు పోటీగా ఆయన వైసీపీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం మరి సీఎం జగన్ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో?