AP Pension : పెన్షన్‌పై ఏపీ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Pension : పెన్షన్‌పై ఏపీ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌..!

 Authored By prabhas | The Telugu News | Updated on :6 March 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  AP Spouse Pension : స్పౌజ్ పెన్షన్‌పై ఏపీ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌

AP Spouse Pension : ఎన్నికల హామీలో భాగంగా కూట‌మి ప్ర‌భుత్వం ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ మొత్తాన్ని రూ.4,000కు పెంచిన సంగ‌తి తెలిసిందే. తాజాగా పెన్షన్ విధానంలో ప్ర‌భుత్వం మరో కీలక మార్పు తీసుకువ‌చ్చింది. భర్త మరణం పొందిన త‌ర్వాత‌ భార్య పెన్షన్ కోసం ఎదురు చూడ‌కుండా వెంటనే పించ‌ను మంజూరు చేసే విధానాన్ని అమలులోకి తీసుకువ‌చ్చింది. సీఎం చంద్రబాబు గతేడాది నవంబరు 1న శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్బంగా స్పౌజ్‌ క్యాటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు పింఛను మంజూరు చేస్తామని ప్రకటించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో భర్త మరణించిన వెంటనే భార్యకు ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు చేప‌ట్టింది.

AP Pension పెన్షన్‌పై ఏపీ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌

AP Pension : పెన్షన్‌పై ఏపీ స‌ర్కార్ గుడ్‌న్యూస్‌..!

ఈ నేప‌థ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ ఓపెన్ చేశారు. భర్త చనిపోతే డెత్ సర్టిఫికెట్, భార్య ఆధార్ కార్డు జిరాక్స్ తో గ్రామ, వార్డు సచివాలయాల్లో అధికారుల్ని సంప్రదించాలని సూచించారు. మార్చి 15వ తేదీలోపు దరఖాస్తులు ఎంపీడీవో/ఎంసీ స్థాయిలో ఆమోదం పొందినట్టు అయితే వచ్చే నెల నుంచి స్పౌజ్ పెన్షన్ కింద రూ.4000 మంజూరు అవుతాయి.

స్పౌజ్ పెన్షన్ పొందేందుకు

– పెన్షనర్ మరణించిన విషయాన్ని జీవిత భాగస్వామి ముందుగా బ్యాంకుకు తెలుపాలి.
– కుటుంబ పెన్షన్ ప్రారంభించమని బ్యాంకును కోరాలి.
– పెన్షనర్ మరణ ధృవీకరణ పత్రం, పీపీఓ కాపీ, వయస్సు/పుట్టిన తేదీ రుజువు, అదనపు చెల్లింపును తిరిగి పొందేందుకు ఒక హామీ పత్రాన్ని జతచేయాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది