Free Gas Bookings : ఏపీలో ఎన్నికల టైం లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కూడా ఉంది. దీని అమలుపై కూటమి సర్కార్ మొదటి అడుగు వేసింది. దీపావళి నుంచి ఈ పథకం అమలు చేసేందుకు ఎన్ని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం దీనికి సంబందించిన బుకింగ్స్ ని కూడా నేడు ప్రారంభించింది. ఏపీ సీఎం చంద్రబాబు అక్టోబర్ 31న శ్రీకాకుళ జిల్లా ఇచ్చాపురం మండలం సోంపేటలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఏపీలో ప్రారంభం అవుతున్న ఈ ఉచిత సిలిండర్ల పథకం కోసం ప్రభుత్వం ఏటా 2684.75 కోట్లు ఖర్చు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా తొలి విడతగా 894.92 కోట్లు విడుదల చేసేందుకు అనుమతి తీసుకున్నారు. ఈ నిధులు త్వరలో రిలీజ్ కానున్నాయి. 31న సీఎం చంద్రబాబు ఉచిత్ గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించగానే రాష్ట్రవ్యాప్తంగా సిలిండర్లు ఇళ్లకు డెలివరీ ఇస్తారు. వీటికి సంబందించిన బుకింగ్స్ స్టార్ట్ చేశారు.
ఈ క్రమంలో సిలిండర్లు ఎలా బుక్ చేసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. లబ్దిదారులు గ్యాస్ సిలిండర్లు తమ గ్యాస్ కంపెనీ వెబ్ సైట్ లో కానీ, మొబైల్ ఫోన్ లో ఐ.వి.ఆర్ నంబర్ కు మిస్ కాల్ ఇచ్చి ఆ తర్వాత గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం ద్వార గ్యాస్ కంపెనీ డిస్ట్ర్బ్యూట్ ఆఫీస్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ అయ్యాక లబ్దిదారుడు ఫోన్ కి సిలిండర్ బుక్ అయినట్టు ఒక మెసేజ్ వస్తుంది. గ్యాస్ సిలిండర్ వద్ద డెలివరీ కోసం బిల్ జనరేట్ అయ్యాక వస్తుంది.
సిలిండర్ లబ్దిదారుడికి డెలివెరీ చేసిన టైం లో ఫోన్ కు ఓటీపీ వస్తుంది. అది చెప్తేనే బోయ్ సిలిండర్ ఇస్తాడు. సిలిండర్ డెలివరీ తర్వాత డిస్ట్రిబ్యూటర్ వెబ్ సైట్ లో దీనికి సంబందించిన వివరాలు అప్డేట్ చేస్తారు. ఐతే లబ్దిదారుడికి సిలిండర్ డెలివెరీ అయిన 24 గంటల్లో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ లబ్దిదారుడి ఖాతాలో పడుతుంది.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.