YS Vijayamma : ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ Ys Jagan కి ఫ్యామిలీ మెంబర్స్ నుంచే శత్రుత్వం మొదలైంది. జగన్ వర్సెస్ షర్మిల Ys Sharmila ఇద్దరి మధ్య జరుగుతున్న ఆస్తి Assets యుద్ధంపై సర్వత్రా ఆసక్తిగా మారింది. ఐతే జగన్, షర్మిల ఆస్తి గొడవలపై విజయమ్మ ఎవరికి సపోర్ట్ ఇస్తుందా అని ఇన్నాళ్లు చిన్న కన్ ఫ్యూజన్ ఉంది. ఐతే నేడు ఆ కన్ ఫ్యూజన్ కి తెర దించుతూ జగన్, షర్మిల ఆస్తి తగాదాలపై ఆమె స్పందించారు. రాజశేఖర్ రెడ్డి గారు ప్రేమించే ప్రతి ఒక్కరికి విజయమ్మ చేస్తున్న అభ్యర్ధన అంటూ ఆమె ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు.తాజా సంఘటనలు మనసుకి చాలా బాధ కలిగిస్తున్నాయని అన్న విజయమ్మ రాజశేఖర్ రెడ్డి గారి జీవితం తెరచిన పుస్తకం అని.. అయితే తన కుటుంబానికి ఏ దిష్టి తైలిందో జరగకూడనివి అన్ని కళ్ల ముందే జరిగిపోతున్నాయని విజయమ్మ అన్నారు. తమ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నారని అన్నారు. చాలామంది తెలియకుండానే మాట్లాడుతున్నారని అన్నారు. ఇది కొనసాగితే తన పిల్లైద్దరికే కాదు రాష్ట్రానికే మంచిది కాదని అన్నారు విజయమ్మ.
తన ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడేవారందరిని మా జీవితంలో మీరు భాగమే అనుకుంటున్నా. ఇది రాజశేఖర్ రెడ్డి Ys Rajasekar reddy కుటుంబం. ఆయనకు మేమెంతో మీరు అంతే.. ఆయన మమ్మల్ని ప్రేమించినట్టే.. మిమ్మల్ని ప్రేమించారు. ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయాక కూడా ఆదరించి అక్కున చేర్చుకున్నారని విజయమ్మ అన్నారు.
దయచేసి కుటుంబం గురించి.. పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడొద్దని కోరారు విజయమ్మ. సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయవద్దని అన్నారు. వైఎస్ కుటుంబం మీద మీకు ప్రేమ ఉంటే ఇంతకంటే ఎక్కువ మాట్లాడొద్దని అన్నారు విజయమ్మ. బ్లడ్ ఈజ్ థికర్ ద్యాన్ వాటర్. వాళ్లు ఇదరు సమాధాన పడతారు. మీరు ఎవరు రెచ్చగొట్టొద్దని అన్నారు. తాను నమ్మిన యేసయ్య తన బిడ్డల సమస్యలకు పరిష్కారం చూపిస్తాడనే నమ్మకం ఉందని విజయమ్మ అన్నారు. ఇటీవల వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయి రెడి వారు మాట్లాడుతున్నై వాళ్లు ప్రేమించిన వైఎస్సార్ గురించి అని మరచి ఆయన కుటుంబ పరువు తీస్తున్నారని స్ప్రుహ లేకుండా అసత్యాలు చెప్పారని అన్నారు. వైఎస్సార్ బ్రతికు ఉండగానే ఆస్తులు పంచారని అన్నారని.. అది అవాస్తవమని అన్నారు. వైఎస్సార్ పిల్లలు ఇద్దరు పెరుగుతున్న రోజూ నుంచి కొన్ని ఆస్తులు పాప పేరు మీద.. కొన్ని జగన్ పేరు మీద పెట్టారు. అంతేకానీ ఆస్తులు పంచలేదని అన్నారు విజయమ్మ. వైఎస్ బ్రతికున్నప్పుడే షర్మిలకు ఆస్తులు ఇచ్చారని అన్నారు. ఐతే జగన్ పేరు మీద ఉన్న ఆస్తుల లిస్ట్ కూడా చదివి ఉండాల్సిందని అన్నారు.
వైఎస్ ఇంకా ఆస్తులు పంచలేదని. కొన్ని ఆస్తులు ఇద్దరు బిడ్డల పేర్లు మీద పెట్టారని అన్నారు విజయమ్మ. ఆస్తులు ఇద్దరికి సమానం అనేది నిజమని.. నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా ఉండాలన్నై వైఎస్ ఆజ్ఞ అని ఆమె అన్నారు. ఐతే ఆస్తులు వృద్ధిలోకి రావడంలో జగన్ కష్టం ఉందనేది నిజమే కానీ ఆస్తులు అన్ని కుటుంబ ఆస్తులే అన్నది నిజమని అన్నారు. ఆయన చివరి రోజుల్లో జగన్ ఆయనకు మాట ఇచారని.. నాన్న నీ తర్వాత ఈ లోకంలో పాప మేలు కోరే వారిలో నేను మొదటి వారిని అని అన్నాడు. అది నిజమని అన్నరు. మొత్తానికి వైఎస్ విజయమ్మ లేఖ వైసీపీ కేడర్ లో సంచలనంగా మారింది.
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
This website uses cookies.