Thalliki Vandanam Scheme : తల్లికి వందనంపై బిగ్ అప్‌డేట్.. రూ.15 వేలు మీ అకౌంట్‌లోకి రావాలంటే ఇలా చేయాల్సిందే..!
ప్రధానాంశాలు:
Thalliki Vandanam Scheme : తల్లికి వందనంపై బిగ్ అప్‌డేట్.. రూ.15 వేలు మీ అకౌంట్‌లోకి రావాలంటే ఇలా చేయాల్సిందే..!
Thalliki Vandanam Scheme : కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన వేళ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీల అమలుకు సిద్ధమవుతోంది. జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్న నేపథ్యంలో, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ అయ్యేలా చర్యలు చేపడుతోంది. ఈ పథకం కింద విద్యార్థుల తల్లులకు రూ.15,000 నగదు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం.

Thalliki Vandanam Scheme : తల్లికి వందనంపై బిగ్ అప్‌డేట్.. రూ.15 వేలు మీ అకౌంట్‌లోకి రావాలంటే ఇలా చేయాల్సిందే..!
Thalliki Vandanam Scheme ఇది చేయండి..
ఈ మొత్తం పొందాలంటే కొన్ని ముఖ్యమైన నిబంధనలు తప్పనిసరి. తల్లులకు నిధులు అందాలంటే, విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతా ఆధార్ నంబర్‌తో లింక్, ఎన్‌పీసీఐ లింక్ అయి ఉండాలి. లేదంటే తిరస్కరించబడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. జూన్ 5వ తేదీలోపు ఆధార్, ఎన్‌పీసీఐ లింకింగ్ ప్రక్రియ పూర్తి చేయాలి. ఇందుకోసం పోస్టల్ శాఖ, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది, బ్యాంకు అధికారులు సహకరించనున్నారని ప్రభుత్వం ప్రకటించింది.
అందుకే విద్యార్థుల తల్లులు వెంటనే తమ అకౌంట్లు ఈ రెండు సంస్థలతో లింక్ అయ్యాయో లేదో తనిఖీ చేసుకోవాలి. ఎవరి బ్యాంక్ ఖాతాలు ఆధార్ మరియు ఎన్‌పీసీఐతో లింక్ అయి లేవో, వారికి “తల్లికి వందనం” నిధులు ఖాతాలోకి జమ కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. తల్లులకు ఈ ప్రక్రియలు పూర్తిచేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు, పోస్టాఫీసులు, సచివాలయాలు, బ్యాంకులు ప్రత్యేకంగా సహాయాన్ని అందిస్తున్నాయి. ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని శాఖలతో కలిసి సహాయం అందిస్తోంది.