AP Govt Good News : గుడ్ న్యూస్ చెప్పిన ప్ర‌భుత్వం.. వారికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

AP Govt Good News : గుడ్ న్యూస్ చెప్పిన ప్ర‌భుత్వం.. వారికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి..!

AP Govt Good News : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శుభ‌వార్త‌ల మీద శుభ‌వార్త‌ల మీద చెబుతూ వ‌స్తుంది. పింఛన్ పెంపుకు శ్రీకారం చుట్టిన గవర్నమెంట్ తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేద పండితులకు నెలకు రూ.3వేల చొప్పున సంభావన రూపంలో చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు అర్హత కలిగిన వారిని […]

 Authored By ramu | The Telugu News | Updated on :31 October 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  AP Govt Good News : గుడ్ న్యూస్ చెప్పిన ప్ర‌భుత్వం.. వారికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి..!

AP Govt Good News : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శుభ‌వార్త‌ల మీద శుభ‌వార్త‌ల మీద చెబుతూ వ‌స్తుంది. పింఛన్ పెంపుకు శ్రీకారం చుట్టిన గవర్నమెంట్ తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేద పండితులకు నెలకు రూ.3వేల చొప్పున సంభావన రూపంలో చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు అర్హత కలిగిన వారిని గుర్తించేలా అధికార యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. నిరుద్యోగ భృతి అందించే బాధ్యతను రాష్ట్రంలోని ఏడు మేజర్‌ ఆలయాలకు అప్పగించారు. ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు దిశగా అడుగులు వేస్తోంది.

AP Govt Good News ఎన్నిక‌ల హామీ..

రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు 600 మంది ఉన్నట్ల్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. వీరందరికీ నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చేలా దేవాదాయశాఖ కార్యదర్శి ఎస్‌.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.గా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ఏపీలో ఎన్డీయే కూటమి కార్యాచరణ చేపట్టింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఏడాది మూడు సిలిండర్ల పథకానికి పచ్చ జెండా ఊపింది. ఇదిలా ఉంటే ఇప్పటికే సిలిండర్ బుక్ చేసుకున్న వారికి దీపావళి రోజున డెలివరీ చేస్తారు. అయితే సిలిండర్ కోసం గ్యాస్ ఏజెన్సీకి రూ.811 కట్టాలి. మళ్లీ ఈ మొత్తం రెండు రోజుల్లో మీ అకౌంట్లలోకి జమ అవుతుంది. వైట్ రేషన్ కార్డు ఉన్నవారంతా ఈ ఉచిత సిలిండర్‌కు అప్లై చేసుకోవచ్చు.

AP Govt Good News గుడ్ న్యూస్ చెప్పిన ప్ర‌భుత్వం వారికి నెలకు రూ3 వేల నిరుద్యోగ భృతి

AP Govt Good News : గుడ్ న్యూస్ చెప్పిన ప్ర‌భుత్వం.. వారికి నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి..!

విద్యార్థులు, నిరుద్యోగులపై ఫోకస్ పెట్టిన టీడీపీ ప్రభుత్వం…సింహాచలం, అన్నవరం, కనకదుర్గ, శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, శ్రీశైలం, కాణిపాకం తదితర ఆలయాల్లోని పండితులకు సంభావన పేరుతో నిరుద్యోగ భృతిని ప్రభుత్వం చెల్లించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ఆలయాల పరిధిలోని 600 మంది వేద పండితులకు ప్రయోజనం కలగనుంది. నిరుద్యోగ భృతి అందుకునే వేద పండితులు వారికి సమీపంలో ఉండే ఆలయాల్లో నిత్యం ఒక గంట పాటు వేద పారాయణ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇదిలా ఉండగా.. ఈ మూడు సిలిండర్లు ఏడాదిలో మూడు విడతలుగా ఇవ్వనున్నారు. అక్టోబర్ 31 నుంచి మార్చి నెలాఖరులోగా ఒకటి. ఏప్రిల్ 1, 2025 నుంచి జులై వరకు మరొకటి. జులై నుంచి నవంబర్ వరకు మూడో సిలిండర్ ఉచితంగా ఇవ్వనున్నారు. అయితే ఈ పథకం అమల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. 1967 ట్రోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇక ఉచిత గ్యాస్ బుకింగ్‌కు తప్పకుండా తెల్ల రేషన్‌కార్డు, ఆధార్ కార్డుదారులు ఉండాలి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది