AP Govt Good News : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం శుభవార్తల మీద శుభవార్తల మీద చెబుతూ వస్తుంది. పింఛన్ పెంపుకు శ్రీకారం చుట్టిన గవర్నమెంట్ తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేద పండితులకు నెలకు రూ.3వేల చొప్పున సంభావన రూపంలో చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు అర్హత కలిగిన వారిని గుర్తించేలా అధికార యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. నిరుద్యోగ భృతి అందించే బాధ్యతను రాష్ట్రంలోని ఏడు మేజర్ ఆలయాలకు అప్పగించారు. ఏపీ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు దిశగా అడుగులు వేస్తోంది.
రాష్ట్రంలో మొత్తం ఇప్పటి వరకు 600 మంది ఉన్నట్ల్లు దేవాదాయశాఖ అధికారులు తెలిపారు. వీరందరికీ నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇచ్చేలా దేవాదాయశాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు.గా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ఏపీలో ఎన్డీయే కూటమి కార్యాచరణ చేపట్టింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఏడాది మూడు సిలిండర్ల పథకానికి పచ్చ జెండా ఊపింది. ఇదిలా ఉంటే ఇప్పటికే సిలిండర్ బుక్ చేసుకున్న వారికి దీపావళి రోజున డెలివరీ చేస్తారు. అయితే సిలిండర్ కోసం గ్యాస్ ఏజెన్సీకి రూ.811 కట్టాలి. మళ్లీ ఈ మొత్తం రెండు రోజుల్లో మీ అకౌంట్లలోకి జమ అవుతుంది. వైట్ రేషన్ కార్డు ఉన్నవారంతా ఈ ఉచిత సిలిండర్‌కు అప్లై చేసుకోవచ్చు.
విద్యార్థులు, నిరుద్యోగులపై ఫోకస్ పెట్టిన టీడీపీ ప్రభుత్వం…సింహాచలం, అన్నవరం, కనకదుర్గ, శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, శ్రీశైలం, కాణిపాకం తదితర ఆలయాల్లోని పండితులకు సంభావన పేరుతో నిరుద్యోగ భృతిని ప్రభుత్వం చెల్లించనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ఆలయాల పరిధిలోని 600 మంది వేద పండితులకు ప్రయోజనం కలగనుంది. నిరుద్యోగ భృతి అందుకునే వేద పండితులు వారికి సమీపంలో ఉండే ఆలయాల్లో నిత్యం ఒక గంట పాటు వేద పారాయణ చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇదిలా ఉండగా.. ఈ మూడు సిలిండర్లు ఏడాదిలో మూడు విడతలుగా ఇవ్వనున్నారు. అక్టోబర్ 31 నుంచి మార్చి నెలాఖరులోగా ఒకటి. ఏప్రిల్ 1, 2025 నుంచి జులై వరకు మరొకటి. జులై నుంచి నవంబర్ వరకు మూడో సిలిండర్ ఉచితంగా ఇవ్వనున్నారు. అయితే ఈ పథకం అమల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా.. 1967 ట్రోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇక ఉచిత గ్యాస్ బుకింగ్‌కు తప్పకుండా తెల్ల రేషన్‌కార్డు, ఆధార్ కార్డుదారులు ఉండాలి.
Revanth Reddy : బీసీ కులాల గణనను నిర్వహించాలన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల వాగ్దానమని పునరుద్ఘాటించిన…
Diwali Wishes : దీపావళి సందర్భంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందువులకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు…
TTD Chairman : తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. ఈ నిర్ణయం ప్రపంచంలోని అతిపెద్ద…
Ginger Hair Fall : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే సమస్యలలో జుట్టు రాలే సమస్య కూడా…
Samantha : అక్కినేని మాజీ కోడలు సమంత సౌత్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఆమె వెండితెర మీద…
Giloy Leaves : మన పరిసర ప్రాంతంలో ఎన్నో రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి. వాటిని మనం పిచ్చి మొక్కలు…
Bigg Boss 8 Telugu : ఈ వారం బిగ్ బాస్ హౌజ్ లో ఒక్కరోజుకే నామినేషన్ ప్రక్రియ పూర్తైంది.ఆ…
Skin Care : సాధారణంగా ప్రతి ఒక్కరికి మోచేతులపై మరియు మోకాళ్లపై నలుపు అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే మన శరీరం…
This website uses cookies.