
Vangalapudi Anitha : అప్పుడు టీచర్.. ఇప్పుడు హోంమంత్రి.. వంగలపూడి అనిత ప్రస్థానం ఇలా సాగింది..!
Vangalapudi Anitha : కొన్ని నెలలుగా ఏపీ రాజకీయాలు హెడ్ లైన్స్‌లో నిలుస్తూ ఉండడం మనం చూశాం. ఎట్టకేలకి ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం మనం చూశాం. ఇక చంద్రబాబుతో పాటు, మరో 24 మంది కూటమి నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి శుక్రవారం వివిధ శాఖలను కూడా కేటాయించారు. ఈనేపథ్యంలో ఏపీ హోమ్ మంత్రిగా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. ఆమె గతంలో వైసీపీ నేతలని చీల్చి చెండాడింది. ముఖ్యంగా రోజాని ఓ రేంజ్ లో ఏకి పారేసింది. ప్రస్తుత ప్రభుత్వంలో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు అనిత.
వంగలపూడి అనిత రాజకీయాల్లో రాకముందు ప్రభుత్వ టీచర్ గా పని చేశారు. అయితే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆమె… 2012లో రాజకీయాల్లోకి వచ్చారు. అనతి కాలంలోనే ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఏపీ హోంశాఖ మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. 1984లో విశాఖపట్నం జిల్లా లింగరాజుపాలెం గ్రామంలో జన్మించారు అనిత. ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎం.ఏ. ఎంఈడీ పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2014లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. తన సమీప వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెంగల వెంకటరావు పై 2,828 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో అనిత పోటీ చేసే స్థానం మారింది. పార్టీ ఆదేశాల మేరకు కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి తానేటి వనితపై పోటీ చేసి 25,248 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి పాయకరావుపేట నియోజకవర్గం కేంద్రంగా మళ్లీ అనిత యాక్టివ్ అయ్యారు. పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాలను నిర్వహిస్తూ… ముందుకెళ్లారు.
Vangalapudi Anitha : అప్పుడు టీచర్.. ఇప్పుడు హోంమంత్రి.. వంగలపూడి అనిత ప్రస్థానం ఇలా సాగింది..!
పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తూ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా అనితకు అవకాశం వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడటంతో అనిత ముందున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కు గురైనప్పటికీ అనిత వెనక్కి తగ్గలేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పాయకరావుపేట నియోజకవర్గం నుంచి అనిత టికెట్ దక్కించుకున్నారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన వంగలపూడి అనిత…వైసీపీ అభ్యర్థి కంబాల జోగులుపై 43,727 ఓట్ల తేడాలో విక్టరీ కొట్టారు.కాగా, 2019 ఎన్నికల్లో అనితపై గెలిచిన వైసీపీ అభ్యర్థి తానేటి వనిత కూడా జగన్ ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా అవకాశం దక్కించుకోవడం కొసమెరుపు.
India EU Free Trade Agreement 2026 | దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్, యూరోపియన్…
Union Budget 2026 ": దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటి వారు రైతులు. “జై జవాన్.. జై కిసాన్” అనే…
Redmi Note 15 Pro 5G : భారత India స్మార్ట్‌ఫోన్ Smart Phone మార్కెట్లో మరో హాట్ అప్డేట్కు…
pakistan : టీ20 వరల్డ్ కప్ india vs pakistan t20 world cup 2026 ప్రారంభానికి ఇంకా రెండు…
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…
Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…
Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…
This website uses cookies.