Ap : ఏపీ రూపురేఖలు మార్చేసే ప్రాజెక్టు.. పూర్తయితే జగన్ కు తిరుగుండదా..?
Ap : ఏపీలో ఇప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమపాళ్లలో నిర్వహిస్తున్నారు సీఎం జగన్. మరీ ముఖ్యంగా ఒక్క చోటనే అభివృద్ధిని కేంద్రీకరించకుండా.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే కడపలో కూడా పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాత్రం వైఎస్సార్ ఈఎంసీ(ఎలాక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్). ఈ ప్రాజెక్ట్‌ను కడప జిల్లాలోని కొప్పర్తి గ్రామ సమీపంలో నిర్మిస్తున్నారు. దీన్ని 2020లో శంఖుస్థాపనలు చేసి ప్రారంభించారు సీఎం జగన్.
ఏపీలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు వారిని ఆర్థికంగా బలపర్చే ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేసినట్టు చెబుతున్నారు. ఇప్పటికే యుద్ధప్రాతిపదకన పనులు చేయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే పలు కంపెనీలకు స్థలాలు కేటాయించారు. అయితే ఇది ఇప్పటిది కాదండోయ్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నప్పుడే కడపలో ఓ పెద్ద కంపెనీని ఏర్పాటు చేయాలని భావించారు. దాన్ని ఇప్పుడు జగన్ పూర్తి చేస్తున్నారు. దీన్ని మొదట్లో 540 ఎకారాల్లో స్టార్ట్ చేసి.. ఆ తర్వాత 801 ఎకరాలకు విస్తరిస్తున్నారు. కంపెనీలకు ప్రధానంగా నీరు, కరెంట్, స్థలాలు కేటాయిస్తే కచ్చితంగా ప్రపంచంలోనే పెద్ద కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడుతాయి.
ఈ విషయాన్ని జగన్ కూడా పసిగట్టారు. అందుకే ఇప్పుడు ఇలాంటికంపెనీలను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది నేషనల్ హైవే 67 కేవలం 5.7 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. అలాగే.. కృష్ణాపురం రైల్వేస్టేషన్ 4.9 కి.మీ, కడప రైల్వే స్టేషన్-10.8 కి.మీల దూరంలో ఉంటుంది. ఇందులో ఎలక్ట్రానిక్ భాగాలు, మొబైల్ హ్యాండ్‌సెట్‌ల తయారీ.. వాటితో పాటు కెమెరాలు, బ్యాటరీలు, ఛార్జర్ లు తయారు చేస్తున్నారు. వాటితో పాటు మెడికల్, ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా తయారు చేయబోతున్నారు. ఇందులో మొత్తం రూ.10 వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది గనక మొత్తం పూర్తి అయితే దాదాపు ఏపీలోని 30 వేల మంది యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ హబ్ గా తయారవుతుంది. ఒక రకంగా ఇది రాయలసీమకే ప్రసిద్ధి గాంచిన కంపెనీగా మారుతుంది. దాని వల్ల మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.