Bro Movie : సినిమాలో కావాలనే ఆ సీన్ పెట్టారా ? విపరీతంగా హార్ట్ అయిన ఏపీ మంత్రి !

Authored By Breaking News | The Telugu News | Updated on : 29 July 2023, 2:15 pm

Bro Movie : జూలై 28వ తారీకు నిన్న ప్రపంచవ్యాప్తంగా పవన్, సాయి ధరంతేజ్ ప్రధాన పాత్రలో నటించిన “బ్రో” విడుదల కావటం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదల నీ సినిమా మిక్స్డ్ టాక్ పంపిణీ చేసుకుంది. అయితే ఈ సినిమాలో కమెడియన్ పృథ్వీరాజ్ పాత్ర ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అది కావాలని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబుని ఇమిటేట్ చేసినట్లు ఉందని టాక్. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సమయంలో అంబటి చేసిన డాన్స్ వీడియోలు వైరల్ కావడం తెలిసిందే.

అయితే “బ్రో” సినిమాలో ఆ సందర్భంగా కథలో సంబంధం లేని పాత్రలో పృథ్వి.. అంబటి రాంబాబు మాదిరిగానే స్టెప్పులు వేయడం జరిగిందట. అసలు ఆ పాత్రను ఎందుకు ఇరికించారు అనేది ఇప్పుడు పెద్ద చర్చగా సాగుతోంది. పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు చేతగాక వైసీపీ అంబటి రాంబాబు పై ఈ రకంగా రివెంజ్ తీర్చుకున్నట్లు కామెంట్లు వస్తున్నాయి. పైగా అప్పట్లో అంబటి వేసుకున్న అదే రంగు షర్టును ధరించి పృథ్వి డాన్స్ వేయటం విశేషం.

ap minister who is extremely hurt about bro movie scene

ap minister who is extremely hurt about bro movie scene

పబ్ లో కనిపించిన రెండుసార్లు అసలు డైలాగు అనేది చెప్పకుండా కేవలం డాన్స్ మూమెంట్ లతో పృథ్వి చల్లారేగిపోతూ ఉంటాడు. పృథ్వి డ్యాన్స్ పై పవన్ పంచ్ వేస్తాడు. ఇదంతా వైసీపీ నేత అంబటి రాంబాబు పై సెటైర్ అనే ప్రచారం సాగుతుంది. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై కావాలని ఆ సీన్ పెట్టడంతో మంత్రి అంబాటి రాంబాబు విపరీతంగా హార్ట్ అయినట్లు టాక్.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp