Bro Movie : బ్రో సినిమా చేయను అని డైరెక్టర్ కి మొహం మీద చెప్పేసిన పాన్ ఇండియా హీరో…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bro Movie : బ్రో సినిమా చేయను అని డైరెక్టర్ కి మొహం మీద చెప్పేసిన పాన్ ఇండియా హీరో…??

 Authored By aruna | The Telugu News | Updated on :30 July 2023,11:00 am

Bro Movie : సినిమా ఇండస్ట్రీలో చాలాసార్లు స్టోరీ ఎంపికల విషయంలో మార్పులు చేర్పులు జరుగుతాయి. ఆ స్టోరీకి మొదటిగా ఒక హీరోని అనుకుంటే చివరికి వేరే హీరో చేస్తారు. ఇలా అవ్వడం సినిమా ఇండస్ట్రీలో చాలా సాధారణం. అలా వదులుకున్న సినిమాలు కొన్ని బ్లాక్ బస్టర్ అవుతాయి. కొన్ని ఫ్లాప్ అవుతాయి. అయితే ఓసారి అలా చేయి జారిపోవడం కూడా మంచిదని చెప్పాలి. అయితే ప్రస్తుతం అలాంటి లక్కీ హీరో ప్రభాస్ అంటూ తెలుస్తుంది. మనకు తెలిసిందే బాహుబలి తర్వాత ప్రభాస్ ఖాతాలో సరైన హిట్లు పడలేదు.

హిట్ కొట్టిన పాన్ ఇండియా స్థాయిలోనే హిట్ కొట్టాలని అభిమానులు అంటున్నారు. ఆయనకు చిన్న సినిమాల ఆఫర్లు వస్తున్న అవి రిజెక్ట్ చేసిన ఫ్యాన్స్ పెద్దగా బాధపడడం లేదు. ఈ క్రమంలోని తాజాగా ప్రభాస్ దగ్గరికి వచ్చిన ఆ ప్రాజెక్టును రిజెక్ట్ చేయడం మంచిదయిందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా విడుదలైన ‘ బ్రో ‘ సినిమాకి మొదటగా డైరెక్టర్ సముద్రఖని హీరో ప్రభాస్ ని అనుకున్నారట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రను ప్రభాస్ వినకుండానే రిజెక్ట్ చేసారట. పాన్ ఇండియా హీరో అయ్యాక ప్రతి సినిమాను పాన్ ఇండియా స్థాయిలోనే చేయాలనుకుంటారు.

Pan India hero reject bro movie

Pan India hero reject bro movie

అందుకే ఈ సినిమా రిజెక్ట్ చేశారని క్లారిటీ ఇచ్చారట. ఆ తర్వాత ఈ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్స్ సూర్య, కార్తీ లను అడిగారట. ఇది తెలిసిన కథ అని వాళ్ళు రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత ఇది పవన్ కళ్యాణ్ వరుణ్ తేజ్ ల వద్దకు వచ్చి ఆగింది. పవన్ సలహా మేరకు వరుణ్ తేజ్ కన్నా సాయి అయితే బాగుంటుందని అది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ గా కలిసి వస్తుందని చెప్పారట. ఇక ఈ సినిమా యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది. ఒకవేళ ప్రభాస్ చేసి ఉంటే పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయ్యేది కాదు. మరోసారి ప్రభాస్ ఖాతాలో ఫ్లాప్ సినిమా పడేది. మొత్తానికి ప్రభాస్ ఈ సినిమాని రిజెక్ట్ చేసి మంచి పని చేశాడు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది