Gottipati Ravikumar : జగన్ ను దేశ బహిష్కరణ చెయ్యాలి.. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ కామెంట్స్..!
Gottipati Ravikumar : ఏపీ మాజీ సీఎం జగన్ ను దేశ బహిష్కరణ చేయాలని దేశ సంప్రదాయాలను గౌరవించలేని జగన్ ఈ దేశంలో ఉండే అర్హత లేదని ఏపీ రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం కల్పించిన అవకాశాలు మొత్తం జగన్ ఒక్కడే సద్వినియోగం చేసుకున్నాడని దుయ్యబట్టారు. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి చేరారో అందరికీ తెలుసని గొట్టిపాటి అన్నారు. మన దేశ సంప్రదాయాలు మనం గౌరవించాలని జగన్ కు సూచించారు గొట్టిపాటి. […]
ప్రధానాంశాలు:
Gottipati Ravikumar : జగన్ ను దేశ బహిష్కరణ చెయ్యాలి.. రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ కామెంట్స్..!
Gottipati Ravikumar : ఏపీ మాజీ సీఎం జగన్ ను దేశ బహిష్కరణ చేయాలని దేశ సంప్రదాయాలను గౌరవించలేని జగన్ ఈ దేశంలో ఉండే అర్హత లేదని ఏపీ రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం కల్పించిన అవకాశాలు మొత్తం జగన్ ఒక్కడే సద్వినియోగం చేసుకున్నాడని దుయ్యబట్టారు. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి చేరారో అందరికీ తెలుసని గొట్టిపాటి అన్నారు. మన దేశ సంప్రదాయాలు మనం గౌరవించాలని జగన్ కు సూచించారు గొట్టిపాటి. భారతదేశం అంటే హిందూ సంప్రదాయాలు మాత్రమే కాదు ముస్లీం, క్రిస్టియన్ సోదరుల సంప్రదాయాలు మనం గౌరవించాలని ఆయన అన్నారు. ఏ విధంగా అయినా దేశ సంప్రదాయాలను గౌరవించలేని వాళ్లు మన దేశానికి, ప్రజలకు ఏం సేవ చేస్తారని అన్నారు. మాజీ సీఎం జగన్ మాటలు వింటుంటే ఐదు సంవత్సరాలు ఆయన ప్రజలకు ఎలాంటి సేవ చేశారో అర్థం అవుతోందని ఫైర్ అయ్యారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
Gottipati Ravikumar దేశానికి ఇచ్చే గౌరవం ఇదేనా..
మీరు దేశానికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ జగన్ ని ఎటాక్ చేశారు గొట్టిపాటి రవికుమార్. మనం ఎలాంటి దేశంలో బ్రతుకుతున్నామో అర్ధం చేసుకోవాలని జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు గొట్టిపాటి. ఇన్నాళ్లు ఏ దేశంలో బరికాడో ఆయనకి తెలియదా అని అన్నారు. జగన్ వ్యక్తిగత రాజకీయ స్వార్ధం కోసం మనం ఏ దేశంలో బతుకుతున్నామో అని సంచలన వ్యాఖ్యలు చేశారని అన్నారు. వెంటనే జగన్ వ్యాఖ్యలను ఉపసం హరించుకోవాలని డిమాండ్ చేశారు.
తిరుమల లడ్డూ వివాదం వైసీపీ ని ఇరకాటంలో పడేసింది. దాని పై జగన్ ను టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం వేస్తున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక రివర్స్ లో ఆయన ప్రభుత్వం పై కామెంట్స్ చేయడం పై రాష్ట్ర మంత్రులు వ్యతిరేకిస్తున్నారు.