Gottipati Ravi Kumar : ఉచిత విద్యుత్‌పై వైసీపీ విష ప్రచారాన్ని నమ్మొద్దు : మంత్రి గొట్టిపాటి రవికుమార్
ప్రధానాంశాలు:
Gottipati Ravi Kumar : ఉచిత విద్యుత్‌పై వైసీపీ విష ప్రచారాన్ని నమ్మొద్దు : మంత్రి గొట్టిపాటి రవికుమార్
Gottipati Ravi Kumar : ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు అంటూ వైసీపీ Ysrcp చేసే విష ప్రచారాన్ని ప్రజలు ఎవ్వరూ నమ్మొద్దని Andhra pradesh ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ Gottipati Ravi Kumar అన్నారు. విద్యుత్ వ్యవస్థపై జగన్ మోహన్‌రెడ్డి Ys Jagan కక్ష పెట్టుకున్నందుకే రోజూ అసత్యాల వ్యాప్తి చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఐదేండ్లు విధ్వంసం చేసిన విద్యుత్ వ్యవస్థను సీఎం చంద్రబాబు నాయుడు అనతి కాలంలోనే సరిదిద్దినట్లు కొనియాడారు.
Gottipati Ravi Kumar ఉచిత విద్యుత్‌పై వైసీపీ విష ప్రచారాన్ని నమ్మొద్దు
ప్రజలకు నాణ్యమైన విద్యుత్ Electricity అందిస్తుండటాన్ని చూసి జగన్ తట్టుకోలేకపోతున్నాడని దుయ్యబట్టారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల ప్రయోజనంపై అవగాహన లేక జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నట్లు విమర్శించారు. ఎలాంటి అదనపు భారం లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించే పీఎం కుసుమ్, సూర్యఘర్ పథకాల వల్ల నష్టమేంటో జగన్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
జగన్ నిర్లక్ష్యం చేసిన వాటిని తాము అందిపుచ్చకోవడాన్ని చూసి ఓర్వలేకపోతున్నట్లు మంత్రి అన్నారు. కుప్పంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సూర్యఘర్ పథకం రాష్ట్రమంతటా అమల్లోకి తెస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలకు సౌర ఫలకాల ఏర్పాటు ఉచితంగా పెడుతున్నట్లు పేర్కొన్నారు.