Roja : సిగ్గుందా పవన్ కళ్యాణ్.. తల్లిని తిట్టించిన వాడు ఒక పక్క.. ఫ్యాన్స్‌ని అలగా జనం అన్నోడు మరోపక్క.. రోజా ఫైర్
Roja : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు గురించే చర్చ. ఆయన అరెస్ట్ పైనే ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. అసలు చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశారు అనేది పక్కన పెడితే చంద్రబాబు అరెస్ట్ పై ఓవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ, ఇంకోవైపు జనసేన ఈ మూడు పార్టీలు మాత్రం ఎవరికి వారే జబ్బలు చరుచుకుంటున్నారు. టీడీపీ నేతలు రోడ్ల మీదికి వచ్చి నిరసన చేస్తుండగా.. వైసీపీ మాత్రం పండుగ చేసుకుంటోంది. మంత్రి రోజా అయితే చంద్రబాబు అరెస్ట్ అయ్యారని ఏకంగా డ్యాన్సులే చేశారు. తాజాగా మరోసారి ఆమె చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. మరోసారి పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.
అమావాస్య రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు అని ప్రకటించారు. ఇది చూసి రాష్ట్ర ప్రజలు అంతా ఈ రాష్ట్రానికి పట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దరిద్రం వదిలిపోయే రోజు దగ్గర్లోనే ఉందని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే జగనన్న చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి. మొదటి నుంచి చెబుతున్నారు.. ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దత్తపుత్రుడు. ప్యాకేజీ స్టార్ అని. అప్పుడేం చేశాడు.. చెప్పులు చూపించాడు. ఇప్పుడు ఆ చెప్పుతో తనను తాను కొట్టుకుంటాడా? తన జెండాను మోసే జనసైనికులను కొడతాడా? ఒకసారి ఆలోచించుకోవాలని రోజా దుయ్యబట్టారు.ఒక పార్టీ పెట్టి పక్కవాడి కోసం తాను పనిచేయడమే కాకుండా.. తన కార్యకర్తల్ని కూడా జెండా కూలీలుగా ప్రతి జెండాను మోయించే ఒకే ఒక్క నాయకుడు ఈయనే. అలాగే జైలులో ఉన్న ఒక ఖైదీతో ప్రజల డబ్బు దోచుకున్న ఒక దొంగతో, ప్యాకేజీ తీసుకొని పొత్తు పెట్టుకున్న ఒకే ఒక్క పార్టీ జనసేన పార్టీ.
Roja : దొంగతో ప్యాకేజీ తీసుకొని పొత్తు పెట్టుకున్న ఒకే ఒక్క పార్టీ జనసేన
ఎంత సిగ్గు చేటూ ఈరోజు రాష్ట్ర ప్రజలే కాదు. పక్క రాష్ట్రాల వాళ్లు కూడా స్పష్టంగా గమనిస్తున్నారు. ఎందుకంటే.. నేనేమో బీజేపీలో పొత్తులో ఉన్నాను.. ఎన్డీఏలో ఉన్నాను అంటాడు. అదే మోదీని హిందీలో అమ్మనాబూతులు తిట్టిన బాలకృష్ణ అలాగే తెలుగులో అమ్మనాబూతులు తిట్టిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటాను అంటాడు. ఇంకో పక్కన తన తల్లిని తిట్టించిన లోకేష్ కు తాను మద్దతు ఇస్తాను అంటాడు. ఇది ఏం మెసేజ్ ఇస్తున్నాడో ఒకసారి ప్రజలంతా కూడా గమనించాలి. నిజంగా ఇతడు ప్రజల మీద ప్రేమ ఉంటే ప్రజల కోసం ఏరోజైనా పోరాటం చేశాడా? కానీ.. ఈరోజు దొంగ కోసం చంద్రబాబు నాయడు కోసం నేను పోరాటం చేస్తున్నానని పోరాటం చేస్తున్నాడు. ఇదే పోరాటం రాజమండ్రిలో 29 మందిని పుష్కరాల్లో తన పబ్లిసిటీ పిచ్చి కోసం చంద్రబాబు చంపేసినప్పుడు ఎందుకు నువ్వు రాలేదు.. ఎందుకు పోరాటం చేయలేదు. అదే ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని బూతులు తిట్టి కొట్టి హింసిస్తే.. నీ అన్న వచ్చినా నువ్వు రాలేదు. ఆ రోజు పోరాటం చేయలేదు.. అంటూ రోజా పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.