Pensions : ఏపీలో నేటి నుంచి పెన్షన్లు ఎలా పంపిణీ .. ఎలా చేస్తారంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pensions : ఏపీలో నేటి నుంచి పెన్షన్లు ఎలా పంపిణీ .. ఎలా చేస్తారంటే..!

Pensions : ఏపీలో మొన్నటి వరకు అన్ని రకాల పెన్షన్లను వాలంటీర్లే తీసుకువచ్చి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఏపీలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. కాబట్టి వాలంటీర్లతో నగదు పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. వాలంటీర్లు నగదు పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొని ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘంఈ నిర్ణయం తీసుకుంది. కోడ్ ముగిసేవరకు వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్, ఇతరత్ర మైబైల్ లాంటివన్నీ కలెక్టర్ ల […]

 Authored By ramu | The Telugu News | Updated on :1 April 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Pensions : ఏపీలో రేపటి నుంచి పెన్షన్లు ఎలా పంపిణీ చేస్తున్నారో తెలుసా..?

Pensions : ఏపీలో మొన్నటి వరకు అన్ని రకాల పెన్షన్లను వాలంటీర్లే తీసుకువచ్చి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఏపీలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. కాబట్టి వాలంటీర్లతో నగదు పంపిణీ చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది. వాలంటీర్లు నగదు పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొని ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘంఈ నిర్ణయం తీసుకుంది. కోడ్ ముగిసేవరకు వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్, ఇతరత్ర మైబైల్ లాంటివన్నీ కలెక్టర్ ల వద్ద డిపాజిట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం.

Pensions హైకోర్టులో పిటిషన్..

పెన్షన్లు ఇవ్వడానికి వాలంటీర్లను పక్కన పెట్టాలని ఆదేశించడంతో ఇప్పుడు అందుకు ప్రత్యామ్నాయంగా సచివాలయ ఉద్యోగుల సాయం తీసుకోవాలని పేర్కొంది. నగదు పంపిణీ కార్యక్రమాల్లో వాలంటీర్ల పాత్ర లేకుండా చూడాలంటూ హైకోర్టులో సీఎఫ్‌డీ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్ మేరకు హైకోర్టు కూడా ఆర్డర్ వేసింది. దాంతో సచివాలయ ఉద్యోగాలను పరిశీలిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పుకొచ్చింది. ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు పెన్షన్ పంపిణీకి గడువు పెంచనున్నారు. ఇప్పటికే గడువు పెంపుపై జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

సచివాలయం పరిధిలో 350 నుంచి 500 వరకు పెన్షన్ దారులు ఉంటారని అంచనా. నిన్ననే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినా సరే ఇవాళ ఆదివారం సెలవుదినం కావడంతో వాలంటీర్లు ట్యాబ్ లను ఇంకా సబ్మిట్ చేయలేదు. రేపు అంటే సోమవారం నాడు పరికరాలను సచివాలయ ఉద్యోగులు స్వాధీనం చేసుకుంటారు. ఆతర్వాత ఎల్లుండి నుంచి పెన్షన్లను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయం తెలియక చాలామంది తమకు పెన్షన్ ఈ నెల వస్తుందో రాదో అన్న ఆందోళనలో పడ్డారని తెలుస్తోంది. అలాంటి వారి కోసం ప్రభుత్వం ఈ ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తోంది.

ఇలా రాబోయే పది రోజుల్లోగా అందరికీ పెన్షన్లను అందజేస్తామని ప్రకటించింది జగన్ ప్రభుత్వం. అయితే ఈ పెన్షన్ లు ఇవ్వకుండా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ అడ్డుకుంటున్నారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. వృద్ధులకు పెన్షన్ రాకుండా చేసి అన్యాయం చేస్తున్నారని మండిపడుతోంది వైసీపీ. దానికి టీడీపీ, జనసేనలు కూడా గట్టిగానే సమాధానాలు ఇస్తున్నాయి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది