Ap Volunteer : సచివాలయాలు, వాలంటీర్లు విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
Ap Volunteer : ఏపీ లో పరిపాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ మీద ఒక ఫైనల్ డెసిషన్ కు వచ్చినట్టు తెలుస్తుంది. దాదాపు ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థని ముగించే దిశగా ఆలోచన చేస్తున్నారని తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండు నెలలు సామాజిక పెన్షన్ లను సచివాలయ సిబ్బంది చేత ఇప్పించారు. 1 వ తేదీనే 100 శాతం పంపిణి చేశారు.పెన్షన్స్ ఇచ్చే వాలంటీర్లు చేసే పని సచివాలయ సిబ్బందితో పంచిస్తున్నారు సో వాటికి ఇబ్బంది లేదు. ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు రావట్లేదు. ప్రజలు అసలు వాలంటీర్లను గుర్తు తెచ్చుకుంటున్నారా అన్న డౌట్ కొడుతుంది. ఇక వారికి శాలరీ కూడా చివరి సారి జూన్ లో గౌరవ వేతనంగా ఇచ్చారని తెలుస్తుంది. జూలై, ఆగస్ట్ రెండు నెలలూ వారికి వేతనాలు అందలేదని తెలుస్తుంది.
ఏపీలో దాదాపుగా రెండున్నరల లక్షల మంది వాలంటీర్లు ఉంటే అందులో ఈమధ్య జరిగిన ఎన్నికల వేళ వైసీపీ ఒత్తిడి వల్ల లక్ష మంది దాకా వాలంటీర్లు రాజీనామా చేశారు. ఇక మిగిలింది లక్షన్నర మంది వాలంటీర్లు మాత్రమే. అయితే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఎలక్షన్స్ టైం లో టీడీపీ హామీ ఇచ్చింది. అంతేకాదు వారికి పది వేల గౌరవ వేతనం కూడా ఇస్తామని చెప్పారు. అందుకే వాలంటీర్లు అంతా వైసీపీకి కాకుండా కూటమికి అనుకూలంగా పనిచేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఖజానా ఖాళీ అయిందని అందుకే వాళ్లకి వేతనాలు ఇవ్వలేమని అంటున్నారు.
Ap Volunteer : సచివాలయాలు, వాలంటీర్లు విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
వాలంటీర్లను కొనసాగించాలి అంటే ఏడాదికి వేల కోట్లు ఖర్చు పెట్టాలి. అందుకే వారు అవసరమా అన్న చర్చ సాగుతుంది. వాలంటీర్లు అంతా గత ప్రభుత్వం వైసీపీ హయాంలో నియామకం జరిగింది. ఈ వ్యవస్థను మరో విధంగా కొనసాగించాలని అనుకున్నా ఇపుడు కుదరదు. ఆర్ధిక వ్యవస్థ కొద్దిగా కుదురు పడ్డాక చేసే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత కొత్తగా నియామకాలు చేపడతారు అని అంటున్నారు. అలా చేస్తే వాలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడినట్టే అని అంటున్నారు. అయితే ఈ విషయంపై రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.