Own House : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ కార్యాలయాలలో వెలుగులు నింపాలని భావిస్తున్నాయి. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సూర్య శక్తిని వినియోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి గల అవకాశాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని భావిస్తుంది. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద ప్రజల ఇళ్లకే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సూర్య ఫలకాలను ఏర్పాటు చేసి తద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇలా చేయడం వలన విద్యుత్ ఉత్పత్తి పెరగడమే కాకుండా, ప్రభుత్వ కార్యాలయాలకి వచ్చే లక్షలాది రూపాయల విద్యుత్ బిల్లులని కూడా ఆదా చేసే అవకాశం ఉంటుంది. సూర్య ఫలకాలను ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఆయా ప్రభుత్వ కార్యాలయాలు వినియోగించుకోవచ్చును.
ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద విద్యుత్ వినియోగదారులు ఇళ్లమీద సూర్య ఫలకాలను అమర్చుకొని తద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం కల్పించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 90 శాతం రాయితీ ఇస్తుంది. ఒక కిలో వాట్ విద్యుత్ ఉత్పత్తికి 30,000 రూపాయలు, రెండు కిలోల వాట్ల విద్యుత్ ఉత్పత్తికి 60 వేల రూపాయలు, మూడు కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తికి 78 వేలను సబ్సీడీగా ఇస్తుండడం శుభపరిణామం అని చెప్పవచ్చు. ఇది పొందడానికి ఆసక్తి ఉన్న గృహ యజమానులు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన వెబ్సైట్లోకి వెళ్లి తమ పేరును నమోదు చేసుకోవచ్చును. అలాగే సూర్య ఫలకాలను అమర్చి ఏజెన్సీల వివరాలు కూడా ఇందులో ఉంటాయి. తమకు నచ్చిన ఏజెన్సీని ఎంచుకోవచ్చును.. ట్రాన్స్ కో విభాగం అధికారులు సాంప్రదాయేతర ఇందన వనరుల అభివృద్ధి సంస్థ అధికారులు కలిసి ఇళ్లమీద సూర్యఫలకాలను ఏర్పాటు చేస్తారు.
ఇళ్లకు ప్రత్యేకమైన మీటర్లను విద్యుత్ శాఖ అధికారులు అమర్చగా, ట్రాన్స్ కో ద్వారా ఎంత విద్యుత్తును వినియోగదారులు ఎంతవరకు ఉపయోగించుకున్నది తెలుసుకోవచ్చును. అలాగే సూర్య ఫలకాలను ద్వారా అదనంగా ఉత్పత్తి అయిన విద్యుత్తును ట్రాన్స్ కో అధికారులు కొనుగోలు చేస్తారు. ఈ మీటర్ల ద్వారా తమ ఎంత ట్రాన్స్ కో ఎంత విద్యుత్తును వినియోగించుకున్నది కూడా మనకు అర్ధమవుతుంది. వినియోగదారులు ట్రాన్స్ కో కు సరఫరా చేసిన విద్యుత్తు యూనిట్లను తగ్గించి, వినియోగదారుడు వాడుకున్న విద్యుత్ కు బిల్లులను అందజేయడం ద్వారా నియోగదారులకు భారీగా విద్యుత్ బిల్లులు ఆదా అవుతుంది .
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.