APSRTC Jobs : APSRTC రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్.. వెంటనే అప్లై చేసుకోండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

APSRTC Jobs : APSRTC రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్.. వెంటనే అప్లై చేసుకోండి..!

 Authored By ramu | The Telugu News | Updated on :8 November 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  APSRTC Jobs : APSRTC రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్.. వెంటనే అప్లై చేసుకోండి..!

APSRTC Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ) వివిధ రకాల అప్రెంటీస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 606 ఖాలీలకు ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా అభ్యర్ధుల అకడమిక్ మెరిట్ ఆధారంగా ఈ ఎంపిక జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ కర్నూలు, విజయవాడ జోన్ల పరిధిలో ఉన్న ఖాళీలు భర్తీ చేసేందుకు ఇచ్చారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి ఉన్న వారి నవంబర్ 6, 2024 నుంచి 20 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

APSRTC Jobs సంస్థ పేరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ)

పోస్ట్ పేరు : అప్రెంటిస్

పోస్టుల వివరాలు :

డీజిల్ మెకానిక్

మోటార్ మెకానిక్

ఎలక్ట్రీషియన్

వెల్డర్

పెయింటర్

ఫిట్టర్

మెషినిస్ట్

డ్రాఫ్ట్స్‌మెన్ (సివిల్)

ఈ ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు :

ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ పొంది ఉండాలి. అది కూడా అకడమిక్ మెరిట్ ఉండాలి.. దాన్ని సీనియారిటీ ప్రకారం చూస్తారు.

నెల జీతం

అప్రెంటిస్‌లు నియమితులైతే తర్వాత సంబంధిత జోన్ మరియు ట్రేడ్‌ ప్రకారం శిక్షణ కాలంలో స్టైపెండ్ ఇస్తారు.

వయోపరిమితి

వయస్సు : 18 సంవత్సరాలు నుంచి 24 సంవత్సరాలు

దరఖాస్తు విధానం

ఏపీఎస్‌ఆర్‌టీసీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఫారమ్‌ భర్తీ చేయాలి.

అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్‌లోడ్ చేయాలి.

APSRTC Jobs APSRTC రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ వెంటనే అప్లై చేసుకోండి

APSRTC Jobs : APSRTC రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్.. వెంటనే అప్లై చేసుకోండి..!

దరఖాస్తు ఫీజు చెల్లించి ఫారమ్‌ సమర్పించాలి.

దరఖాస్తు రుసుము

డాక్యుమెంట్స్ పరిశీలన కోసం 118 రూ. చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ

అభ్యర్ధుల అకడమిక్ మెరిట్‌ ఆధారంగా ఉంటుంది. ఐటీఐలో పొందిన మార్కులు ఇంకా సీనియారిటీకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: నవంబర్ 6, 2024

దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 20, 2024

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది