Ambati Rambabu : మాజీ మంత్రి పై కేసు నమోదు.. కేసులకు నేను భయపడాలా.. అంబటి రాంబాబు..!
Ambati Rambabu : వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బుధవారం గుంటూరులో జరిగిన వైసీపీ నిరసన కార్యక్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆయనపై బీఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 353 కింద కేసు నమోదైంది. పోలీసుల విధుల్లో ఆటంకం కలిగించడమే కాకుండా, వారిని బెదిరించారని పేర్కొంటూ గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసులో అంబటి రాంబాబుతో పాటు మరికొంతమంది వైసీపీ కార్యకర్తలపై కూడా కేసు నమోదైనట్టు సమాచారం.
Ambati Rambabu : మాజీ మంత్రి పై కేసు నమోదు.. కేసులకు నేను భయపడాలా.. అంబటి రాంబాబు..!
సిద్ధార్థనగర్‌లోని తన నివాసం నుంచి అనుచరులతో కలిసి ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా బయలుదేరిన అంబటిని, పోలీసులు ముందుగా కలెక్టరేట్ వద్ద అడ్డుకున్నారు. అయినా వారు కంకరగుంట ఓవర్ బ్రిడ్జి వరకు ప్రదర్శన నిర్వహించారు. అక్కడ మరోసారి పోలీసులు అడ్డుకోవడంతో అంబటి రాంబాబు తీవ్ర అసహనానికి లోనై, అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐ వెంకటేశ్వర్లుతో వాగ్వాదానికి దిగారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు వివరణ ఇచ్చినా, అంబటి మండిపడి “ఎలా పోనివ్వరో చూస్తా” అంటూ సీఐపై దూషణలకు దిగారు.
ఈ వ్యవహారంలో సీఐపై మాటల దాడి చేసినట్టు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. సీఐ వెంకటేశ్వర్లు “మర్యాదగా మాట్లాడండి” అని హెచ్చరించినా, అంబటి మాట మానలేదని అంటున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో పోలీసు విధులకు అడ్డంకిగా వ్యవహరించారని గుర్తించి, భారత న్యాయ వ్యవస్థ నూతనంగా అమలులోకి తీసుకొచ్చిన BNS (Bharatiya Nyaya Sanhita) 2023లోని సెక్షన్ 353 కింద కేసు నమోదైంది. ఈ పరిణామాలు వైసీపీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.