Andhra Pradesh : ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన పాల ధరలు..!!
Andhra Pradesh : కరోనా తర్వాత ప్రపంచంలో పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయి. సామాన్యుడు బతికే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఆర్థిక ఖజానాలు దెబ్బతిన్నాయి. ఇటువంటి తరుణంలో ప్రభుత్వాలు తీసుకుంటున్నాను నిర్ణయాలు.. సామాన్యుడి నెత్తిపై పిడుగుల్లా మారుతున్నాయి. ఇప్పటికే నిత్యవసరాలు ధరలు మరియు కూరగాయలు ఇంకా ఇంధన ధరలు… ఆకాశాన్ని అంటుతున్నాయి. పైగా వేసవికాలం దగ్గర పడటంతో కూరగాయల ధరలకీ రెక్కలు వచ్చేసాయి. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాలధార పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో…
ఏపీ వాసులకు షాక్ ఇచ్చినట్లు పరిస్థితి మారింది. ఏపీలో విజయ పాల ధర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతుల పాల సేకరణ ధరలు ఇంకా నిర్వహణ రవాణా ఖర్చులు పెరగటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అంతేకాదు పెరిగిన పాల ధరలు మార్చి ఒకటి అనగా బుధవారం నుంచి అమలులోకి రానున్నట్లు స్పష్టం చేయడం జరిగింది. ఈ పరిణామంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి ఒకటవ తారీఖు నుంచి విజయ పాల ధర అర లీటర్ ప్యాకెట్ పై రూపాయి పెరగనుంది. అయితే ఈ పెరుగుదల కేవలం ఆరు రకాల
పాల ప్యాకెట్లకు మాత్రమే వర్తిస్తుందని కృష్ణ మిల్క్ యూనియన్ ప్రకటనలో తెలియజేయడం జరిగింది. పెరుగు, చిన్న పాల ప్యాకెట్లు మరియు ఇతర పాల పదార్థాల ధరలలో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. అంతేకాదు నెలవారి పాల కార్డుదారలకు మార్చి 9 వరకు పాతదారలే వర్తిస్తాయని స్పష్టం చేసింది. దీంతో మార్చి 1 నుంచి ఏపీలో అర లీటరు విజయ లోఫ్యాట్ (డీటీఎం) ధర రూ. 27 కాగా.. ఎకానమీ (టీఎం) రూ. 29.. అలాగే ప్రీమియం (స్టాండర్డ్) రూ. 31.. ఇక స్పెషల్ (ఫుల్ క్రీమ్) రూ. 36, గోల్డ్ రూ. 37, టీ-మేట్ రూ. 34గా ఉండనుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మిల్క్ యూనియన్ సభ్యులు తెలియజేశారు. ఈ క్రమంలో ప్రజల సహకరరించాలని కోరారు.