Balakrishna : గుడివాడలో కొడాలి నాని పై బాలకృష్ణ పోటీ..గెలుపు ఎవరిది ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Balakrishna : గుడివాడలో కొడాలి నాని పై బాలకృష్ణ పోటీ..గెలుపు ఎవరిది ..?

Balakrishna : 2024 శాసనసభ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవ్వడం చంద్రబాబు నాయుడు కి ఎంత ముఖ్యమో అంతే సమానంగా కొంతమందిని రాజకీయంలోకి రాకుండా చేయడం ఎమ్మెల్యేలుగా మళ్లీ గెలవకుండా చూసుకోవడం అంతే ముఖ్యమైన అంశం అవుతుంది. కొంతమందిని ఆపాలి అనుకునే వాళ్లలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి కంటే పై స్థాయిలో కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు వాళ్లని ఆపాలని టీడీపీ చూస్తుంది. ముఖ్యంగా కొడాలి నాని ఎన్నికల్లో గెలవకుండా చేయాలని టీడీపీ ప్రయత్నిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో […]

 Authored By aruna | The Telugu News | Updated on :4 January 2024,6:00 pm

Balakrishna : 2024 శాసనసభ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అవ్వడం చంద్రబాబు నాయుడు కి ఎంత ముఖ్యమో అంతే సమానంగా కొంతమందిని రాజకీయంలోకి రాకుండా చేయడం ఎమ్మెల్యేలుగా మళ్లీ గెలవకుండా చూసుకోవడం అంతే ముఖ్యమైన అంశం అవుతుంది. కొంతమందిని ఆపాలి అనుకునే వాళ్లలో వై.యస్.జగన్మోహన్ రెడ్డి కంటే పై స్థాయిలో కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు వాళ్లని ఆపాలని టీడీపీ చూస్తుంది. ముఖ్యంగా కొడాలి నాని ఎన్నికల్లో గెలవకుండా చేయాలని టీడీపీ ప్రయత్నిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో కొడాలి నాని, రోజా లాంటి వాళ్లను కంట్రోల్ చేయడం మా వల్ల కాదు అని ఎన్నోసార్లు టీడీపీ వాళ్ళు చేతులెత్తేసిన పరిస్థితి ఉంది. ఇన్నాళ్ళ నుంచి చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శిస్తున్న కొడాలి నానిని తన నియోజకవర్గంలో సరైన అభ్యర్థి పెట్టి కొడాలి నాని ఓడించ లేకపోతే టీడీపీ అధికారంలో వచ్చిన కూడా అది ఓటమి అవుతుంది. అందుకే గుడివాడలో కొడాలి నాని కి పోటీ బాలకృష్ణని పెడితే ఎలా ఉంటుందాని ఆలోచిస్తున్నారు కానీ ఇది ఒక గాసిప్ లాగా వినిపిస్తుంది.

పోటీ చేస్తే కొడాలి నాని సత్తా ఏంటో తెలుస్తుంది. అలాగే బాలకృష్ణ సత్త కూడా తెలుస్తుంది. కొడాలి నాని బాలకృష్ణ ను పెట్టిన తర్వాత కూడా గెలిస్తే అతడి సత్తా ఏంటో తెలుస్తుంది. బాలకృష్ణ హిందూపురంలో మాత్రమే గెలవగలడు, ఒకప్పుడు నందమూరి తారక రామారావు కంచుకోటగా ఉన్న హిందూపురం కాదని వేరేచోట పోటీ చేస్తే బాలకృష్ణకు గెలిచే సత్తా లేదని ఎద్దేవా చేసే వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు అవుతుంది. బాలకృష్ణ గుడివాడలో పోటీ చేస్తే కొడాలి నాని మీద గెలిస్తే బాలయ్య రాజకీయంగా ప్రూవ్ చేసుకున్నట్లు అవుతుంది. బాలకృష్ణను కాకుండా వేరే వాళ్ళని పెడితే తెలుగుదేశం పార్టీకి దెబ్బ పడుతుందని అంటున్నారు. గుడివాడలో ఒక్కో ఎన్నికలకు కొత్త వాళ్లను చంద్రబాబు పెడుతున్నారు. మరి ముఖ్యంగా ఎన్నారైలను, తెలియని వాళ్లను గుడివాడలో పెడుతున్నారని క్యాడర్లో ఫీలింగ్ ఉంది. కొడాలి నాని లాంటి మాస్ లీడర్ ను ఎదుర్కోవాలంటే బాలయ్య లాగా, అచ్చెన్నాయుడు లాగా మాస్ లీడర్ అయి ఉండాలి.

అంతే తప్ప మెతక స్వభావం ఉన్నవాళ్లు, డబ్బులు పెట్టేవాళ్ళు ఉంటే అక్కడ టీడీపి ఎట్టి పరిస్థితుల్లో గెలవదని తెలుగుదేశం క్యాడర్లో వినిపిస్తుంది. గుడివాడలో ఎప్పుడు ఎన్నికల్లో నిలిచిన ఒక వర్గం మాత్రమే టీడీపి కి సపోర్టు ఇస్తుంది. అది కొడాలి నాని కి ప్లస్ అవుతుంది. అలా జరగకుండా ఉండాలంటే బాలకృష్ణ లాంటి మాస్ లీడర్ ని అక్కడ నిలబడితే క్యాడర్లో ఉన్న యువత, సీనియర్లు అందరూ కలిసి వచ్చి బాలకృష్ణ గెలుపుకి పనిచేయడానికి వీలుంటుంది. దీంతోపాటు గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి ఏమాత్రం ఉండదు. రోడ్లు చాలా చెత్తగా ఉంటాయి. టౌన్ లో కూడా రోడ్లు బాగోవని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా బాలయ్య పక్షాన నిలబడే అవకాశం ఉంటుంది. మరి గుడివాడ నియోజకవర్గం నుంచి బాలకృష్ణ పోటీ చేస్తారా లేదా అనేది చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది