Balakrishna Vs Jr NTR : ఎన్టీఆర్ వర్ధంతి రోజు బయటపడ్డ విభేదాలు.. జూ ఎన్టీఆర్‌ ప్లెక్సీలను తొలగించమని ఆదేశించిన బాల‌కృష్ణ‌.. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna Vs Jr NTR : ఎన్టీఆర్ వర్ధంతి రోజు బయటపడ్డ విభేదాలు.. జూ ఎన్టీఆర్‌ ప్లెక్సీలను తొలగించమని ఆదేశించిన బాల‌కృష్ణ‌.. వీడియో !

 Authored By aruna | The Telugu News | Updated on :18 January 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Balakrishna Vs Jr NTR : ఎన్టీఆర్ వర్ధంతి రోజు బయటపడ్డ విభేదాలు.. జూ ఎన్టీఆర్‌ ప్లెక్సీలను తొలగించమని ఆదేశించిన బాల‌కృష్ణ‌.. వీడియో !

Balakrishna Vs Jr NTR : జనవరి 18న మహా నాయకుడు నందమూరి తారకరామారావు వర్ధంతి. ఈ సందర్భంగా మరోసారి నందమూరి ఫ్యామిలీల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని నందమూరి బాలకృష్ణ టీడీపీ నేతలకు ఆదేశించడంతో వెంటనే వాటిని తొలగించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. వారు వెళ్లిన కాసేపటికి బాలకృష్ణ వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను చూసి వాటిని వెంటనే తొలగించాలని హుకుం జారీ చేశారు.

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో బాలకృష్ణ ఆ ఫ్లెక్సీలను చూసి తీయించేయ్..వెంటనే తీయించేయ్.. అని టిడిపి నేతలకు చెప్పడం వీడియోలో రికార్డు అయింది. కాగా ఇటీవల కాలంలో టీడీపీ బహిరంగ సభల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటాలతో ఆయన అభిమానులు సీఎం ఎన్టీఆర్.. సీఎం ఎన్టీఆర్ అంటూ జెండాలు ఫ్లెక్సీలతో కనబడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ మౌనంగా ఉండి పోవడంతో చంద్రబాబు సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ పై రకరకాలుగా వ్యతిరేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పబ్లిక్ గా జూనియర్ ఎన్టీఆర్ ను బాలకృష్ణ అవమానించారు.

ఇదే విషయంపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఆయనకు నష్టమేమీ లేదని, వెయ్యి మంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చిన మమ్మల్ని ఏమీ చేయలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. ఇక చంద్రబాబు నాయుడు ఈరోజు కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు లో సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించి రా కదలిరా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సీనియర్ ఎన్టీఆర్ స్వస్థలం అయిన నిమ్మకూరులో నేడు వర్ధంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు రా కదలిరా బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది