Balakrishna : తమ్ముడు పవన్ కళ్యాణ్ రుణం ఈ జన్మకు నేను తీర్చుకోలేనురా.. పవన్‌కి బాలయ్య సెల్యూట్

Advertisement

Balakrishna : ప్రస్తుతం ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ స్కామ్ లో చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు పంపించారు. ఇక.. చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అయితే ఓవైపు వైసీపీ నేతలు సంబురాలు చేసుకుంటుండగా, టీడీపీ నేతలు మాత్రం రోడ్ల మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

చంద్రబాబు అరెస్ట్ పై నారా లోకేశ్ ప్రభుత్వం తీరుపై మండిపడిన విషయం తెలిసిందే. నారా భువనేశ్వరి కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును పరామర్శించి వచ్చారు. అయితే.. జైలులో సరైన సౌకర్యాలు లేవని, కనీసం స్నానం చేయడానికి వేడి నీళ్లు కూడా ఇవ్వడం లేదని భువనేశ్వరి మండిపడిన విషయం తెలిసిందే. తాజాగా నందమూరి బాలకృష్ణ చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. అలాగే.. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఇచ్చిన మద్దతుపై ఆయనకు సెల్యూట్ కొట్టారు. పవన్ కళ్యాణ్ రుణం ఈ జన్మకు తీర్చుకోలేనని మీడియా ముందు చెప్పారు.

Advertisement
balakrishna says thank you to pawan kalyan
balakrishna says thank you to pawan kalyan

Balakrishna : చంద్రబాబు అరెస్ట్ అయ్యారని చాలామంది గుండె ఆగింది

24 గంటలు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. కొత్త రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తే ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని బ్రష్టుపట్టించారని బాలకృష్ణ మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రి ఎంత అవినీతి చేశారో ఎవరికి తెలియదు. లక్ష కోట్ల అవినీతి చేశాడు. బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. ఎన్ని కేసులు ఉన్నాయో తెలియదు. కాంగ్రెస్ పార్టీ హయాం నుంచే ఆయన మీద ఎన్నో కేసులు పెట్టారు. ఆయన గురించి ఎంత అభివర్ణించాలని బాలకృష్ణ సెటైర్లు వేశారు. వారానికి అందరికీ ఒక రోజు అయినా సెలవు ఉంటుంది. కానీ.. అది కూడా తీసుకోకుండా కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని తెలంగాణకు దీటుగా అభివృద్ధి చేస్తే ఇవాళ మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం. అగమ్యగోచరంగా ఉంది. జనం అంతా కన్ఫ్యూజన్ గా ఉన్నారు. అస్తవ్యస్తంగా జరుగుతోంది. మొరిగే కుక్కలను పట్టించుకోం. ఎదురు తిరగడమే ప్రతి ఒక్క పౌరుడు చేయాల్సిన పని.. అంటూ బాలకృష్ణ ధ్వజమెత్తారు.

Advertisement
Advertisement