Rythu Bharosa : రైతు భరోసా అదిగో.. ఇదిగో అనడమే.. రేవంత్ సర్కార్ పై రైతుల ఆగ్రహం..!

 Authored By sudheer | The Telugu News | Updated on :26 February 2026,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Rythu Bharosa : రైతు భరోసా అదిగో.. ఇదిగో అనడమే.. రేవంత్ సర్కార్ పై రైతుల ఆగ్రహం..!

  •  Rythu Bharosa : రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యంపై మండిపడుతున్న రైతులు

  •  Rythu Bharosa : అదిగో ..ఇదిగో అనడమే తప్ప రైతు భరోసా నిధులు మాత్రం అందడం లేదంటూ రైతుల ఆగ్రహం

Rythu Bharosa : తెలంగాణలో రైతు భరోసా నిధుల పంపిణీలో జరుగుతున్న జాప్యంపై అన్నదాతల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తెలంగాణలో యాసంగి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నా, పెట్టుబడి సాయం కింద అందాల్సిన రైతు భరోసా నిధుల కోసం రైతులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. Revanth Reddy రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి “ఇదిగో.. అదిగో..” అంటూ కాలయాపన చేస్తోందని, క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఏడాదికి ఎకరానికి రూ. 12,000 ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, కనీసం గతంలో ఉన్న పెట్టుబడి సాయాన్ని కూడా సకాలంలో అందించకపోవడంపై అసహనం వ్యక్తమవుతోంది. డిసెంబర్, జనవరి నెలలు గడిచిపోయినా, మున్సిపల్ ఎన్నికల సాకుతో నిధుల విడుదలలో జాప్యం చేయడం రైతులను అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

Rythu Bharosa : రైతు భరోసా అదిగో.. ఇదిగో అనడమే.. రేవంత్ సర్కార్ పై రైతుల ఆగ్రహం..!

Rythu Bharosa : రైతు భరోసా అదిగో.. ఇదిగో అనడమే.. రేవంత్ సర్కార్ పై రైతుల ఆగ్రహం..!

Rythu Bharosa : కేబినెట్ భేటీపై ఆశలు – తీరని నిరాశ

ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీపై రైతాంగం భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ సమావేశంలో రైతు భరోసా నిధుల విడుదలపై స్పష్టమైన నిర్ణయం వెలువడుతుందని భావించిన రైతులకు తీవ్ర నిరాశే ఎదురైంది. కేబినెట్ ఎజెండాలో కాంట్రాక్టులు, కమిషన్లు మరియు రియల్ ఎస్టేట్ అంశాలకు ఇచ్చిన ప్రాధాన్యత రైతు సమస్యలకు ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. అప్పటికే అప్పులు చేసి పంటలు వేసిన రైతులు, సాయం అందుతుందన్న ఆశతో ఉన్నా, ప్రభుత్వం ఈ అంశాన్ని పక్కన పెట్టడంపై గ్రామాల్లోని రచ్చబండల వద్ద ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని స్వయంగా ముఖ్యమంత్రి విస్మరించడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Rythu Bharosa  ఆర్థిక పరిమితులు మరియు విధానపరమైన గందరగోళం

గత వానాకాలం సీజన్‌లో సుమారు 69 లక్షల మందికి పైగా రైతులకు రూ. 8,744 కోట్లు బదిలీ చేసిన ప్రభుత్వం, ఈసారి నిధుల సమీకరణలో విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆర్బీఐ ద్వారా రూ. 9,000 కోట్లు సమీకరించినప్పటికీ, ఆ నిధులను రైతు భరోసాకు కాకుండా ఇతర అవసరాలకు మళ్లించారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అలాగే, ఐటీ చెల్లింపుదారులు మరియు ఉన్నతాదాయ వర్గాలను మినహాయించే ప్రక్రియపై జరుగుతున్న సర్వే కూడా జాప్యానికి కారణంగా మారుతోంది. గత ప్రభుత్వ హయాంలో పరిమితులు లేకుండా అందిన సాయం, ఇప్పుడు ఎకరాల కోతతో కుదించబడటంపై చిన్న, సన్నకారు రైతులు భగ్గుమంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే నిధులు విడుదల చేయకపోతే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని ప్రభావం పడే అవకాశం ఉంది.

sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి