Balineni Srinivasa Reddy : బాలినేని, సామినేనిలు పార్టీలో చేరాక వచ్చే పదవులు ఇవేనా..!
ప్రధానాంశాలు:
Balineni Srinivasa Reddy : బాలినేని, సామినేనిలు పార్టీలో చేరాక వచ్చే పదవులు ఇవేనా..!
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు మెల్లమెల్లగా ఖాళీ అవుతున్నారు. పార్టీకి చెందిన నాయకులు వేరే పార్టీలలో చేరుతుండడంతో వైసీపీ కీలక నేతలు కలవరం చెందుతున్నారు. ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తాజాగా ఆ పార్టీని వీడారు. వీరిద్దరూ ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లి కలిశారు. జనసేన పార్టీలో చేరేందుకు వీరిద్దరూ తమ ఆసక్తిని పవన్ కళ్యాణ్ కు తెలిపారు. దీంతో పవన్ కళ్యాణ్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
Balineni Srinivasa Reddy జనసేన ఆఫర్స్..
బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను వేర్వేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వచ్చి కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరూ వైసీపీని వీడాల్సిన పరిస్ధితులపై ఆయనకు వివరించారు. అలాగే జనసేనలోకి వచ్చాక తమకు లభించే గౌరవంపైనా చర్చించారు. ఈ మేరకు పవన్ వారికి కీలక హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ తరహాలో కాకుండా సీనియర్ నేతలకు కీలక పదవులు ఇస్తామని చెప్పినట్లు తెలిసింది. బాలినేని, సామినేని ఉదయభాను ఇద్దరికీ ఎమ్మెల్సీ అవకాశాలు కల్పిస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రకాశం జిల్లాకు చెందిన బాలిని వైఎస్సార్ జగన్ హయాంలో మంత్రిగా రెండు సార్లు పనిచేశారు. ఇప్పుడు వైసీపీని వీడి జనసేనకు జై కొట్టారు. అలాగే మరో కీలక నేత, క్రిష్ణా జిల్లా జగ్గంపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా జనసేనలో చేరుతున్నారు. ఈయన కూడా మెగా కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా పేరు పొందారు. వైఎస్సార్ హయాంలో జగన్ హయాంలో ఎమ్మెల్యే గా ప్రభుత్వ విప్ గా పనిచేసిన ఉదయభాను కు మంత్రి పదవి జగన్ విస్తరణలో కూడా ఇవ్వలేదు అన్న అసంతృప్తి ఉంది. మొత్తానికి బలమైన సామాజిక వర్గానికి చెందిన ఉదయభాను జనసేన ను ఎంచుకున్నారు. ఈ ఇద్దరు నేతలకు తగిన గౌరవ మర్యాదలు జనసేనలో లభిస్తాయని హామీ దక్కిందని చెబుతున్నారు. ఈ ఇద్దరికీ శాసన మండలిలో ఎమ్మెల్సీ పదవులు కన్ ఫర్మ్ అయ్యాయని చెబుతున్నారు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.