Buchepalli Venkayamma : ప్రతిసారి అలగడమే కదా, దమ్ముంటే కుర్చీ టచ్ చేయ్.. బాలినేనికి వెంకాయమ్మ సవాల్
ప్రధానాంశాలు:
Buchepalli Venkayamma : ప్రతిసారి అలగడమే కదా, దమ్ముంటే కుర్చీ టచ్ చేయ్.. బాలినేనికి వెంకాయమ్మ సవాల్
Buchepalli Venkayamma : జనసేన ప్లీనరీలో మాజీ సీఎం జగన్ పై బాలినేని విమర్శలు చేయడంతో ఇప్పుడు జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ తన ఆస్తులతోపాటు తన వియ్యంకుడి ఆస్తులను కాజేశారని , భవిష్యత్తులో జగన్ సీఎం కాలేరంటూ బాలినేని జోస్యం చెప్పారు. బాలినేనీ ఈ వ్యాఖ్యలపై వైసీపీ సీరియస్ గా స్పందించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఘాటుగా స్పందించారు. సవాల్ విసిరారు.

Buchepalli Venkayamma : ప్రతిసారి అలగడమే కదా, దమ్ముంటే కుర్చీ టచ్ చేయ్.. బాలినేనికి వెంకాయమ్మ సవాల్
Buchepalli Venkayamma బాలినేనిపై ఫైర్..
జిల్లాలో ప్రతి ఒక్కరినీ వేధించి ఆస్తులు దోచుకున్నావ్. నీ బాధితుడు కాని వారు జిల్లాలో ఒక్కడు కూడా లేరు. నువ్వు పార్టీ మారిన తర్వాత వైసీపీ బాగుందని అందరూ అనుకుంటున్నారు. నువ్వు జడ్పీ చైర్మన్ ను మార్చేస్తాను అంటున్నావ్. నీలాగా అవకాశవాదులు ఎవరూ జడ్పీటీసీలుగా లేరు. అంతా పార్టీ కోసం పనిచేసిన వారే ఉన్నారు. అయ్యా పవన్ కల్యాణ్ గారు ఒక్క విషయం గుర్తించుకోండి. బాలినేని ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనమైపోతుంది అంటూ బూచేపల్లి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బూచేపల్లి సీటును లాగేస్తానని, జెడ్పీటీసీని పడగొడతానని, తనను ఛైర్‌పర్సన్ స్థానం నుంచి పదవీచ్యుతురాలిని చేస్తానంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి అంటున్నాడు కాని, తన సీటును టచ్ కూడా చేయలేడని వెంకాయమ్మ సవాల్ విసిరారు. బాలినేని ఆశచూపే డబ్బులుకు గానీ, బెదిరింపులకు గానీ భయపడేవాళ్లిక్కడ ఎవరూ లేరని అన్నారు.