TDP : ఇక తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయినట్టేనా..?
TDP : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ కనుమరుగైపోవడం తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 ఎన్నికలలో గెలిచిన గాని 2019 ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అయితే మరోసారి ఆంధ్రాలో జరగబోయే ఎన్నికలలో కూడా టీడీపీ ఓడిపోవడం గ్యారంటీ అని సర్వే ఫలితాలు వస్తున్నాయి. అక్కడి రాష్ట్రం ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ 2019 ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలలో దాదాపు 90 శాతం హామీలు అమలు చేయడం జరిగింది. భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నారు.
కరోనా లాంటి కష్ట కాలంలో సైతం ప్రజలను సంక్షేమ పథకాల ద్వారా ఆదుకుని.. ప్రజలలో ఓ నమ్మకం కలిగించుకున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అవినీతి అక్రమ కేసులలో ఇరుక్కోవటం సంచలనంగా మారుతుంది. సరిగ్గా జరగబోయే ఎన్నికలకు ఏడాది కూడా టైం లేని సమయంలో ఐటి నుండి నోటీసులు రావడంతో పాటు మరోపక్క స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ కావటం ఆ పార్టీ నేతలకు టెన్షన్ పుట్టిస్తూ ఉంది. ఈ కేసులలో దాదాపు సాక్షాధారాలతో దర్యాప్తు సంస్థలు పట్టుకోవడంతో చంద్రబాబు జైలుకెళ్లే పరిస్థితి ఉందని ప్రచారం జరుగుతుంది.
ఇటువంటి పరిణామాలతో తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలలో గెలవడం అనేది అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ చంద్రబాబుకి శిక్ష పడితే ఆయన మాదిరిగా పార్టీని ముందుకు నడిపించే నాయకుడు మరొకరు లేరని అంటున్నారు. నారా లోకేష్ నాయకత్వంపై సొంత పార్టీలో ఉన్న నేతలకే నమ్మకం లేదని టాక్. ఇటువంటి పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలలో ఓడిపోతే తెలంగాణలో కనుమరుగైనట్టు ఆంధ్రలో.. కూడా కనుమరుగైనట్టే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆల్రెడీ ఈసారి జరగబోయే ఎన్నికలలో ఓడిపోతే తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని చంద్రబాబు ఒకానొక సందర్భంలో ప్రకటన కూడా చేయడం జరిగింది. దీంతో ఈసారి జరగబోయే ఎన్నికలపైనే టీడీపీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.