YSRCP : బెజవాడ వైసీపీలో ఏం జరుగుతోంది? టీడీపీ ఇక్కడ వైసీపీని బోల్తా కొట్టించడం ఖాయమా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

YSRCP : బెజవాడ వైసీపీలో ఏం జరుగుతోంది? టీడీపీ ఇక్కడ వైసీపీని బోల్తా కొట్టించడం ఖాయమా?

Vijayawada : రాజ‌కీయంగా అత్యంత కీల‌క‌మైన న‌గ‌రం విజ‌య‌వాడ‌. ఇక్క‌డ ఒక‌ప్పుడు క‌మ్యూనిస్టులు, త‌ర్వాత‌.. కాంగ్రెస్ రాజ‌కీయంగా రాజ్యమేలాయి. ఇక్క‌డ ఆ పార్టీల్లో ఉన్న నేత‌లే కార‌ణం. క‌మ్యూనిస్టు, కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త‌తోనే ఇక్క‌డ వారికి ప‌ట్టు చిక్కింది. టీడీపీ 1994, 1999లో అధికారంలో ఉన్నా కూడా విజ‌య‌వాడ న‌గ‌రంలో ఆ పార్టీని శాసించే నాయ‌కులు లేరు. అయితే 2014 త‌ర్వాత మాత్ర‌మే టీడీపీ కూడా ఇక్క‌డ పుంజుకుంది. రెండు అసెంబ్లీ.. ఒక పార్ల‌మెంటు స్థానాన్ని […]

 Authored By sukanya | The Telugu News | Updated on :6 August 2021,2:40 pm

Vijayawada : రాజ‌కీయంగా అత్యంత కీల‌క‌మైన న‌గ‌రం విజ‌య‌వాడ‌. ఇక్క‌డ ఒక‌ప్పుడు క‌మ్యూనిస్టులు, త‌ర్వాత‌.. కాంగ్రెస్ రాజ‌కీయంగా రాజ్యమేలాయి. ఇక్క‌డ ఆ పార్టీల్లో ఉన్న నేత‌లే కార‌ణం. క‌మ్యూనిస్టు, కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త‌తోనే ఇక్క‌డ వారికి ప‌ట్టు చిక్కింది. టీడీపీ 1994, 1999లో అధికారంలో ఉన్నా కూడా విజ‌య‌వాడ న‌గ‌రంలో ఆ పార్టీని శాసించే నాయ‌కులు లేరు. అయితే 2014 త‌ర్వాత మాత్ర‌మే టీడీపీ కూడా ఇక్క‌డ పుంజుకుంది.

రెండు అసెంబ్లీ.. ఒక పార్ల‌మెంటు స్థానాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. అయితే.. ఇప్పుడు బెజ‌వాడ టీడీపీలో నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోవ‌డంతో ఇప్పుడు మూడు ముక్క‌లు అయ్యి.. చీలిక‌లు పీలిక‌లు అయిపోయింది. ఈ గ్యాప్‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని పుంజుకోవాల్సిన వైసీపీ నాయ‌కులు కూడా ఇదే ప‌ద్ధతిలో ముందుకు సాగుతున్నారని టాక్ వినిపిస్తోంది. బెజ‌వాడ వైసీపీలో ఎంద‌రో కీల‌క నేతలు ఉన్నా ఎవ‌రూ కూడా ఒక‌రితో ఒక‌రు మ‌న‌సు విప్పి మాట్లాడుకోవ‌డం లేదు. ఎవ‌రికివారుగానే రాజ‌కీయాలు చేసుకుంటూ త‌మ‌త‌మ‌ వ్యాపారాలు చ‌క్క‌బెట్టుకుంటున్నారు. ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లోని సెంట్ర‌ల్‌, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాలు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి.
దూకుడు మీదున్నా..


అదే స‌మ‌యంలో తూర్పులో యువ నాయ‌కుడు దేవినేని అవినాష్ దూకుడుగా ఉన్నారు.. అయితే.. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న వెలంప‌ల్లి శ్రీనివాస్ మంత్రి అయినప్పటికీ వెల్లంపల్లికి, సెంట్ర‌ల్ ఎమ్మెల్యేకు మ‌ధ్య పొస‌గ‌డం లేద‌ని అంటున్నారు. ఇక‌, న‌గ‌ర పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న బొప్ప‌న భ‌వ‌కుమార్‌ను ఎవ‌రూ లెక్క చేయ‌డం లేద‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఎవ‌రికి వారు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం.జ‌గ‌న్ ద‌గ్గ‌ర ప‌లుకుబ‌డి కోసం త‌హ‌త‌హ‌లాడ‌డంతోనే కాలం గ‌డిపేస్తున్నార‌నే వాదన బ‌లంగా వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే పార్టీ పుంజుకునే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. ఎక్క‌డిక‌క్క‌డ గ్రూపులు, వ‌ర్గాల‌తో స‌త‌మ‌తం అవుతోంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ళ్లీ టీడీపీ పుంజుకునే అవ‌కాశం ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. బ‌ల‌మైన నేత వెస్ట్ లో ఉంటే, వెలంప‌ల్లికి బ్రేక్ ప‌డుతుంద‌ని అంచనా వెల్లువెత్తుతోంది. ఈ స్థానంపై జనసేన కన్నేసిందని, వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిని దింపనుందని టాక్ వినిపిస్తోంది. ఇంత జ‌రుగుతున్నా.. వైసీపీ నేత‌లు మాత్రం పుంజుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై జగన్ దృష్టి పెడితే గానీ, కొలిక్కి రాదని కేడర్ చర్చించుకుంటోంది.

sukanya

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది