Balakrishna : నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడుకి జగన్ మార్క్ దెబ్బ..!
Balakrishna : సినీనటుడు నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు తెలుసు కదా. ఆయన పేరు భరత్. ఆయన గీతం విద్యా సంస్థల అధినేత. ఆయన గత సంవత్సరం కూడా పోటీ చేశారు. కానీ.. గెలవలేదు. ఈసారి వైజాగ్ ఎంపీ సీటు కోసం పోటీ చేస్తారని తెలిసింది కానీ.. ఆయన వైజాగ్ కంటే కూడా భీమునిపట్నంలో పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఆయన భీమునిపట్నంలో పోటీ చేయాలని ఎందుకు అనుకుంటున్నారో తెలియదు కానీ.. అసలు భీమిలీలో పోటీ చేయడానికి టీడీపీ నుంచి చాలామంది ఆశావహులు ఉన్నారు.
ఒకవేళ విశాఖ ఎంపీ సీటు పొత్తుల్లో భాగంగా వేరే పార్టీకి పోయినా కూడా తనకు కనీసం భీమిలి సీటు అయినా దొరుకుతుంది అనేది భరత్ ప్లాన్. అందుకే భీమిలి మీద ప్రస్తుతం ఫోకస్ చేశారు. నిజానికి.. ఆయన వ్యాపారాలు కూడా అక్కడే ఉన్నాయి. గీతం విద్యాసంస్థలు భీమిలి నియోజకవర్గం కిందికే వస్తాయి. అందుకే భీమిలీ నుంచి ఆయన పోటీ చేయడానికి ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చు కానీ.. అవతల వైపు ఉన్నది మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కాబట్టి అక్కడ టఫ్ గానే ఉంటుంది ఎన్నిక.
Balakrishna : భీమిలీ సీటును జనసేన కూడా అడుగుతోంది కదా
ఇక్కడే అసలు సమస్య.. ఎందుకంటే.. భీమిలీ సీటు మీద జనసేన కూడా పట్టు పడుతోంది. అక్కడి నుంచి జనసేన తరుపున పంచకర్ల సందీప్ అనే వ్యక్తి పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు హామీ ఇచ్చారట. పంచకర్ల 2019 లోనే భీమిలీ నుంచి పోటీ చేసి బాగానే ఓట్ల శాతాన్ని తెచ్చుకున్నాడు. అందుకే.. ఈసారి మళ్లీ ఆయనకే ఇచ్చేందుకు జనసే పార్టీ సిద్ధంగా ఉంది. మరి భరత్ కూడా అదే సీటు కావాలంటున్నాడు. ఇక్కడే టీడీపీ హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై క్లారిటీ లేదు. చూద్దాం ఏం జరుగుతుందో?