Big Breaking : వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన వ్యాఖ్యలు వీడియో..!!
Big Breaking : ఆంధ్రప్రదేశ్ AP రాష్ట్రంలో రాజకీయం చాలా రసవతరంగా సాగుతోంది. వచ్చే ఎన్నికలలో వైసీపీ Ycp పార్టీని గద్దె దించాలని ప్రతిపక్ష పార్టీలు టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. ఇక ఇదే సమయంలో వచ్చే ఎన్నికలలో గెలిస్తే 30 సంవత్సరాల వెనక్కి తిరిగి చూసుకో అక్కర్లేదని వైసీపీ నేతలకు జగన్ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో సర్వేలు చేస్తూ ప్రజలలో పట్టున్న నాయకులకే టికెట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పుకొస్తున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్ pilli subhash chandra boses వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురంలో తనకి కాకుండా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మళ్లీ టికెట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి ఇండిపెండెం పోటీచేస్తా అంటూ వైసీపీ పార్టీ హైకమాండ్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి..చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి. మొదటి నుండి వైయస్ కుటుంబానికి పిల్లి సుభాష్ చంద్రబోస్ వీర విధేయుడు. 2004 లో కాంగ్రెసు పార్టీ టికెట్ ఇవ్వకపోతే ,వైస్సార్ గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలిపి గెలిపించారు. 2009 లో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇచ్చి…గెలిచాక మంత్రి పదవి ఇచ్చారు.
తరువాత వైస్సార్ మరణించాక మంత్రి పదవి వదులుకొని జగన్ కి అండగా నిలబడటం జరిగింది. 2012 లో జరిగిన ఉపఎన్నికలలో ఓడిపోయారు. 2014లో కూడా రామచంద్రాపురం టికెట్ ఓడిపోయారు. 2014-19 మధ్యలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా క్రమంలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పిల్లి సుభాష్ చంద్రబోస్ నీ జగన్ గౌరవించారు. జగన్ Ys Jagan కి రాజకీయంగా మొదట నుండి అండగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్.. వైసీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది.
నాకు కాకుండా ఆయనకు టికెట్ ఇస్తే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తా
వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురంలో ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మళ్లీ టికెట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి ఇండిపెండెం పోటీచేస్తా – పిల్లి సుభాష్ చంద్రబోస్ pic.twitter.com/0h50l9yyhm
— Telugu Scribe (@TeluguScribe) July 23, 2023