YCP – BJP : బీజేపీకి వైసీపీ సాయం.. ఈ కొత్త గేమ్ ఎందుకు.. బీజేపీ ప్లాన్ ఏంటి? వైసీపీ ఏం సాయం చేస్తుంది?
YCP – BJP : కక్కలేక మింగలేక అంటే అర్థం తెలుసు కదా. ఇప్పుడు ఏపీలో వైసీపీ పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉంది. కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలు.. పార్టీకి లేనిపోని సమస్యలు తెచ్చిపెడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే కదా. అప్పుడు ఆయన వైసీపీ నేతలతో ఫోన్ లో మాట్లాడారట. డైరెక్ట్ గా సీఎం జగన్ తో కాకుండా ఓ వైసీపీ ఎమ్మెల్యేకు ఫోన్ చేశారట. బీజేపీతో ఆ ఎమ్మెల్యే సానుకూలంగా ఉండటంతో ఆ ఎమ్మెల్యేతో నడ్డా మాట్లాడారట.
ఆయనతో మాట్లాడిన నడ్డా.. బీజేపీకి సాయం చేయాలని.. ఎందుకు వైసీపీ ప్రభుత్వం ఆ విషయం గురించి మాట్లాడటం లేదని ఆ ఎమ్మెల్యేను సూటిగా ప్రశ్నించారట. ప్రస్తుతం తాడేపల్లిలో ఈ విషయమే హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లినప్పుడు కూడా బీజేపీ నేతలు తమకు అవకాశం వచ్చినప్పుడు సాయం చేయాలని కోరారట.
YCP – BJP : ఏపీకి బీజేపీ ఎంతో చేస్తోందని చెప్పుకుంటున్న బీజేపీ
అసలు వైసీపీ ప్రభుత్వం.. బీజేపీకి చేసే సాయం ఏముంటుంది. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ.. బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. పోనీ.. భవిష్యత్తులో బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది.. అప్పుడు వైసీపీ సాయం చేయాలి అనేది కూడా లేదు. ఫుల్ మెజారిటీలో బీజేపీ ప్రభుత్వం ఉంది. వైసీపీ ఎంపీలతో తనకు అవసరమే లేదు.
అయినప్పటికీ వైసీపీ సాయం చేయాలని బీజేపీ ముఖ్య నేతలు చెబుతున్నారు కానీ.. ఏ సాయం చేయాలో మాత్రం వాళ్లు చెప్పడం లేదు. పోనీ.. బీజేపీకి ఏం సాయం చేయాలో కూడా వైసీపీకి తెలియడం లేదు. అదంతా పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వానికి తాము చాలా సాయం చేస్తున్నాం. మేము సానుకూలంగా ఉన్నాం అని చెప్పుకుంటుంది బీజేపీ. ఇందులో వాస్తవం కూడా లేకపోలేదు.
ఎందుకంటే.. ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ఏపీ ప్రభుత్వం వైపునకు రాకుండా అడ్డుకుంటోంది బీజేపీ ప్రభుత్వం. అంతవరకు బాగానే ఉంది. ఏపీలో ఈడీ, సీబీఐ లాంటి సంస్థలు ప్రభుత్వం వైపు చూడలేదు. అంటే బీజేపీ.. వైసీపీకి ఈవిధంగా సపోర్ట్ చేస్తుందా? ఈ సాయాన్ని తిరిగి వైసీపీ నుంచి ఆశిస్తోందా? అనేదానిపై క్లారిటీ లేదు.
మరోవైపు బీజేపీ ప్రస్తుతం తెలంగాణను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తెలంగాణ విషయంలో బీజేపీ.. వైసీపీ మద్దతు కోరుతోందా? తెలంగాణలో వైసీపీకి కాస్తో కూస్తో అభిమానులు ఉన్నారు. కేడర్ ఉంది. రెడ్డి వర్గం కూడా వైసీపీకి మద్దతు పలుకుతోంది. వాళ్లను బీజేపీ వైపునకు మళ్లించేందుకు బీజేపీ.. వైసీపీ మద్దతును కోరుతోందా అనేదే ఇప్పుడు వైసీపీకి కూడా అర్థం కాని ప్రశ్న. ఈ ప్రశ్నకు మరి ఎప్పుడు సమాధానం దొరుకుతుందో?