Vallabhaneni Vamsi : ఊహించని బ్రేకింగ్.. టీడీపీ లోకి వల్లభనేని వంశీ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vallabhaneni Vamsi : ఊహించని బ్రేకింగ్.. టీడీపీ లోకి వల్లభనేని వంశీ..?

 Authored By siddhu | The Telugu News | Updated on :21 February 2026,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Vallabhaneni Vamsi : ఊహించని బ్రేకింగ్.. టీడీపీ లోకి వల్లభనేని వంశీ..?

Vallabhaneni Vamsi  : కృష్ణా జిల్లా Krishna district రాజకీయాల్లో ఇప్పుడు వల్లభనేని వంశీ తీరు హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో గన్నవరం gannavaram constituency నుండి వైసీపీ YCP  అభ్యర్థిగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన వంశీ ఇప్పుడు తన రాజకీయ పంథాను పూర్తిగా మార్చేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన తన అనుచరులను పరామర్శించడానికి వెళ్తున్న పర్యటనల్లో ఎక్కడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా గానీ లేదా జగన్ మోహన్ రెడ్డి ఫోటో గానీ కనిపించడం లేదు. కనీసం ఫ్యాన్ గుర్తు కూడా లేకుండా కేవలం తన సొంత ఫోటోలతోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని తిరుగుతున్నారు. ఇది చూస్తుంటే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేయడానికి సిద్ధమయ్యారా అనే అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి. పార్టీతో సంబంధం లేకుండా కేవలం తన వ్యక్తిగత ఇమేజ్ తోనే జనాల్లోకి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

Vallabhaneni Vamsi ఊహించని బ్రేకింగ్ టీడీపీ లోకి వల్లభనేని వంశీ

Vallabhaneni Vamsi : ఊహించని బ్రేకింగ్.. టీడీపీ లోకి వల్లభనేని వంశీ..?

గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు మరియు లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న వంశీ ఆ తర్వాత అనూహ్యంగా వైసీపీకి దగ్గరయ్యారు. అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. ఆ వ్యాఖ్యల వల్లే ఆయనకు జగన్ దగ్గర మంచి ప్రాధాన్యత దక్కిందనే టాక్ కూడా ఉంది. అయితే 2024 ఎన్నికల ఫలితాలు ఆయన రాజకీయ భవిష్యత్తును తలకిందులు చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా యార్లగడ్డ వెంకట్రావు చేతిలో భారీ మెజారిటీతో ఓడిపోవడం మరియు ఆ తర్వాత కేసులు జైలుకు వెళ్లడం వంటి పరిణామాలు వంశీని తీవ్రంగా కలచివేసినట్లు ఉన్నాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో తనను తాను కాపాడుకోవడానికే ఆయన వైసీపీ జెండాను పక్కన పెట్టేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Vallabhaneni Vamsi  వైసీపీ జెండా పీకేసి సొంత కుంపటి

వంశీ మళ్ళీ టీడీపీలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారా అన్న చర్చ కూడా గన్నవరంలో జోరుగా సాగుతోంది. ఎన్నికల ప్రచారంలో ఇవే నా చివరి ఎన్నికలు అని ఆయన ప్రకటించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని ఇప్పుడు అర్థమవుతోంది. వైసీపీలో ఉంటే తన రాజకీయ చాప్టర్ క్లోజ్ అయిపోతుందని భావించిన వంశీ మెల్లమెల్లగా ఆ పార్టీకి దూరం జరుగుతూ సేఫ్ జోన్ వెతుక్కుంటున్నారు. ఒకవేళ టీడీపీ లోకి వెళ్లడం కుదరకపోయినా కనీసం ఆ పార్టీతో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలనేది ఆయన ప్లాన్ లా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఎక్కడా వైసీపీ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని తన స్థానంలో దుట్టా సీతామహాలక్ష్మికి మద్దతు ఇస్తానని ఆయన గతంలోనే చెప్పారు కాబట్టి ఇక వైసీపీతో ప్రయాణం ముగిసినట్లేనని ఆయన కేడర్ కూడా ఫిక్స్ అయిపోయింది.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే సామెత వంశీ విషయంలో నిజమయ్యేలా ఉంది. ఎవరినైతే నోటికొచ్చినట్లు తిట్టారో ఇప్పుడు మళ్ళీ అదే పార్టీ వైపు చూస్తున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి. ఒకవేళ టీడీపీ తలుపులు తీయకపోయినా వైసీపీని వదిలేయడం మాత్రం పక్కా అని ఆయన పర్యటనలు చెబుతున్నాయి. ఫ్యాన్ గుర్తును పీకేయడం అంటే జగన్ నాయకత్వాన్ని ధిక్కరించడమే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాబోయే రోజుల్లో వంశీ అధికారికంగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తారా లేక ఇలాగే స్వతంత్రంగా వ్యవహరిస్తూ కాలం గడుపుతారా అన్నది వేచి చూడాలి. ఏదేమైనా గన్నవరం రాజకీయాల్లో వంశీ అడుగులు ఇప్పుడు వైసీపీని డైలమాలో పడేశాయి.

siddhu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది