Chandrababu : 118 కోట్ల ఐటీ నోటీసులకి సంబంధించి చంద్రబాబుని కాపాడే పనిలో బీజేపీ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chandrababu : 118 కోట్ల ఐటీ నోటీసులకి సంబంధించి చంద్రబాబుని కాపాడే పనిలో బీజేపీ..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :8 September 2023,4:00 pm

Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 118 కోట్ల రూపాయల అవినీతి చేసినట్లు ఐటీ శాఖ నోటీసులు పంపించడం తెలిసిందే. ఈ క్రమంలో కీలక ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. వాట్సాప్ చాటింగ్ కోడ్ భాషలు.. అన్నీ కూడా ఇటీవల బయట పెట్టడం జరిగింది. దీంతో వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు. కచ్చితంగా చంద్రబాబు జైలుకెళ్తారని కామెంట్లు చేస్తున్నారు. నిన్న కళ్యాణదుర్గం లో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా తాను రేపు మాపో అరెస్టు అవుతానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అయితే చంద్రబాబు నూట పద్దెనిమిది కోట్ల స్కామ్ విషయంలో…బీజేపీ లైట్ తీసుకున్నట్లు తాజా పరిణామాలపై వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కవితకు లిక్కర్ స్కాంలో నోటీసులు అందిన వెంటనే బిజెపి హడావిడి చేసింది. కానీ ఏపీలో చంద్రబాబు విషయానికి వచ్చేసరికి మాత్రం గోప్యత పాటిస్తోంది. పైగా వెనుకేసుకొచ్చేలా బిజెపి వ్యవహార శైలి ఉంది. ఈ విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం ఆదాయపు పన్ను నోటీసులను సర్వసాధారణంగా తేల్చేశారు. అవి అందరికీ వస్తుంటాయని లైట్ తీసుకున్నారు. మరో ఏపీ బీజేపీ నేత సత్యకుమార్ కూడా చంద్రబాబుని అరెస్టు చేయాల్సిన పని లేదని వెనకేసుకొచ్చినట్లు మాట్లాడారు.

bjp in the task of protecting chandrababu regarding 118 crore it notices

Chandrababu : 118 కోట్ల ఐటీ నోటీసులకి సంబంధించి చంద్రబాబుని కాపాడే పనిలో బీజేపీ..!!

సో మొత్తం మీద చూసుకుంటే ఈ ముడుపుల విషయంలో చంద్రబాబుని కేంద్రమే మేనేజ్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. సరిగ్గా ఇంకా ఎన్నికలకు ఏడాది కూడా టైం లేకపోవడంతో చంద్రబాబుతో కలిసి బీజేపీ ఎన్నికలను ఎదుర్కోవటానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో చంద్రబాబుని కాపాడే పనిలో బీజేపీ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది