pawan kalyan : రాజకీయంగా పవన్ అజ్ఞాని అనుకుంటే బొక్కబోర్లా పడ్డటే.. సనాతనం వెనక అంత ప్లానా..!
ప్రధానాంశాలు:
pawan kalyan : రాజకీయంగా పవన్ అజ్ఞాని అనుకుంటే బొక్కబోర్లా పడ్డటే.. సనాతనం వెనక అంత ప్లానా..!
pawan kalyan : పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారాడు.ఆయన పది సంవత్సరాలుగా అధికారం దక్కించుకోవడం కోసం ఎంతో ఫైట్ చేశారు.ముఖ్యంగా జగన్‌కి వ్యతిరేఖంగా పని చేశారు. టీడీపీ, బీజేపీతో కలిసి ఈ సారి అధికారం దక్కించుకోవాలని ప్లాన్ చేసిన పవన్ విజయం సాధించారు. తను పోటీ చేసిన స్థానంతో పాటు పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలలో విజయం సాధించి రికార్డ్ సృష్టించింది. ప్రస్తుతం పవన్ ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇటీవల తిరుమల లడ్డూ వ్యవహారంలో పవన్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తిరుపతి బాలాజీ కాలనీలోని జ్యోతిరావు పూలే కూడలి వద్ద పవన్ కల్యాణ్ వారాహి బహిరంగ సభలో పాల్గొన్నారు. బహిరంగ సభలో వారాహి డిక్లరేషన్ అంశాలు పవన్ వివరించారు. ఈరోజు వారాహి సభ ప్రత్యేకమైనదని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయిందని, ఈ 100 రోజుల్లో ఎప్పుడూ బయటకు రాలేదని తెలిపారు.
pawan kalyan ఏదో నడుస్తుంది..
ప్రజలకు ఇచ్చి హామీలను ఎలా అమలు చేయాలి, రాష్ట్రాభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచించామన్నారు. ఆంధ్రప్రదేశ్ బలం కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉందని, ఏడుకొండలవాడికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటామని ధ్వజమెత్తారు. అన్ని ఓట్ల కోసమే చేయమని అన్నారు. తన జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని అనుకోలేదన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని పేర్కొన్నారు.తిరుమల లడ్డూలో కల్తీ జరగిందనడానికి ఏ మాత్రం ఆధారాల్లేవంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం స్పష్టం చేసినప్పటికీ పవన్ కల్యాణ్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తిరుపతిలో వారాహి బహిరంగ సభ సందర్భంగా పరోక్షంగా విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. సనాతన ధర్మం పాటించే వారి పట్ల చట్టాలు కఠినంగా వ్యవహరిస్తోన్నాయని, ధర్మాన్ని వ్యతిరేకించే వారికి న్యాయస్థానాలు రక్షణ సైతం కల్పిస్తోన్నాయని వ్యాఖ్యానించడం ఆయన తెగువకు అద్దం పట్టినట్టయింది. దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా ఓ వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందనీ తేల్చి చెప్పారు. దీనిపై డిక్లరేషన్ చేశారు.
పవన్ కళ్యాణ్ ఇలా చేయడానికి కారణం ఉందని అంటున్నారు విశ్లేషకులు. తాము అనుసరిస్తోన్న హిందుత్వ విధానానికి పవన్ కల్యాణ్ ఓ రకంగా బ్రాండ్ అంబాసిడర్లా మారాడనీ బీజేపీ భావిస్తోన్నట్లు చెబుతున్నారు. పవన్ సనతాన నినదాన్ని అందుకున్న తరువాత రాజకీయంగా ఆయన మైలేజీ పెరిగిందనే నిర్ణయానికీ వచ్చిందనీ అంటున్నారు. ఈ ఉద్దేశంతో జనసేనతో విలీన ప్రతిపాదనలను బీజేపీ తెర మీదికి తెచ్చిందంటూ ది న్యూస్ మినిట్ ఓ కథనాన్ని ప్రచురించింది. జమిలి ఎన్నికల నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనను విలీనం చేసుకోవాలని బీజేపీ పట్టుదలతో ఉందని పేర్కొంది. రాజకీయంగా తమ కంటే ప్రజల్లో మంచి ఆదరణ, ఛరిష్మా, సొంతంగా బలమైన కాపు సామాజిక ఓటుబ్యాంక్‌ను కలిగివున్న పవన్ కల్యాణ్ సారథ్యాన్ని వహిస్తోన్న జనసేనను విలనీం చేసుకోవాలని బీజేపీ బలంగా భావించే పవన్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుందని అంటున్నారు.