Brother Anil : అక్కడ వైసీపీ ఎందుకు లేదు.. క్లారిటీ ఇచ్చిన షర్మిళ భర్త..!
ప్రధానాంశాలు:
Brother Anil : అక్కడ వైసీపీ ఎందుకు లేదు.. క్లారిటీ ఇచ్చిన షర్మిళ భర్త..!
Brother Anil : గత కొద్ది రోజులుగా ఏపీ, తెలంగాణలో వైఎస్సార్ కుటుంబ సభ్యుల వివాదం గురించి ఆసక్తికర చర్చ నడుస్తుంది. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆమె రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు షర్మిల ఉదంతం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఆస్తుల విషయంలో అన్నా చెల్లెళ్లైన జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఒకరికొకరు లేఖాస్త్రాలు సంధించుకుని రాజకీయంగా కాక రేపారు. ఇందులో ఎవరి వెర్షన్ వారిదే.వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానులు అయితే.. చెల్లి షర్మిళకు తండ్రి ఆస్తితో పాటు .. తాను సొంతంగా సంపాదించిన ఆస్తిలో ఓ భాగం కూడా ఇచ్చారు. ఇలా సొంత ఆస్తిని పంచిన అన్న బహుశా ప్రపంచంలో ఎవరు ఉండరని వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు.
Brother Anil జగన్ అతి తెలివితేటలు..
విజయమ్మను కోర్టుకు లాగారంటే దానికి కారణం ఎవరని ప్రశ్నించిన షర్మిల, సొంత కుమారుడే తల్లిని కోర్టుకు లాగడం దారుణం కాదా అని మండిపడ్డారు. తనకు లాభం ఉందని అనుకుంటే జగన్ ఎవరినైనా వాడుకుంటారని, తనకు లాభం లేదని అనుకుంటే ఎవరినైనా అణచివేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కుమారుడిని ఎందుకు కన్నాను, చిన్నప్పుడే చంపేస్తే బాగుండేది కదా అని విజయమ్మ అనడం లేదని, ఇలాంటివి చూసేందుకేనా బతికి ఉన్నానా అని అమ్మ బాధపడుతోందని షర్మిల తెలిపారు. ఇలాంటి వ్యక్తి మీకు నాయకుడో, శాడిస్టో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆలోచించాలని షర్మిల కోరారు.
అయితే ఆస్తుల వివాదంపై బ్రదర్ అనీల్ స్పందించారు. ఆస్తుల గురించి తనకు పూర్తిగా తెలియదని, షర్మిలకు అయితే ఆస్తులు పంచలేదని మాత్రం తెలిపారు. ఈ సమయంలో అసలు జగన్ కు షర్మిలకు మధ్య రగడ ప్రారంభమవ్వడానికి గల కారణాల్లో ఒకటైన “తెలంగాణలో వైసీపీ” అనే విషయాన్ని ప్రస్థావించారు. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ భారీ సాధించిన తర్వాత ప్రశాంత్ కిశోర్ వచ్చి షర్మిలను తెలంగాణలో పార్టీ పెట్టాలని సూచించినట్లు చెప్పారని అన్నారు. ఈ విషయంపై స్పందించిన జగన్… “నో నో నో, అక్కడ కేసీఆర్ ఉన్నాడు, మాకు ఇబ్బంది అవుతాది, అసెట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి అని అన్నారంట.. అప్పటి నుంచీ డిఫరెన్సెస్ మొదలయ్యాయి” అని అనిల్ అన్నారు. అంటే తెలంగాణలో పార్టీని విస్తరించడం కంటే ఆస్తులను కాపాడుకునే విషయంలోనే జగన్ పూర్తి దృష్టి పెట్టాడని పలువురు ముచ్చటించుకుంటున్నారు.