Buddha Venkanna : పేర్ని నాని మోకాళ్లపై కూర్చుని రంగ అభిమానులకు సారీ చెప్పాలి – బుద్ధా వెంకన్న | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Buddha Venkanna : పేర్ని నాని మోకాళ్లపై కూర్చుని రంగ అభిమానులకు సారీ చెప్పాలి – బుద్ధా వెంకన్న

 Authored By ramu | The Telugu News | Updated on :25 May 2025,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Buddha Venkanna : పేర్ని నాని మోకాళ్లపై కూర్చుని రంగ అభిమానులకు సారీ చెప్పాలి - బుద్ధా వెంకన్న

Buddha Venkanna : వైసీపీ నేత పేర్ని నానిపై తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న తీవ్రమైన విమర్శలు చేశారు. బీసీ నేత కొల్లు రవీంద్రను అక్రమంగా 55 రోజులపాటు జైలులో పెట్టించి, ఆయన మామయ్య నడకుదిటి నరసింహారావు మానసికంగా కుంగిపోయి మరణించేలా చేశారని ఆరోపించారు. వల్లభనేని వంశీని వంగవీటి రంగా వంటి మహానాయకుడితో పోల్చడం దారుణమని, ఇలాంటి వ్యాఖ్యలకు పేర్ని నాని మోకాళ్లపై కూర్చుని రంగా అభిమానులకు, ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వంశీ పేద ప్రజల కోసం పని చేసే వ్యక్తి కాదని, ఆయన డబ్బుల కోసమే పని చేసే వ్యక్తి అని విమర్శలు గుప్పించారు.

Buddha Venkanna పేర్ని నాని మోకాళ్లపై కూర్చుని రంగ అభిమానులకు సారీ చెప్పాలి బుద్ధా వెంకన్న

Buddha Venkanna : పేర్ని నాని మోకాళ్లపై కూర్చుని రంగ అభిమానులకు సారీ చెప్పాలి – బుద్ధా వెంకన్న

Buddha Venkanna : వంశీ ప్రజల మనిషి కాదు డబ్బు మనిషి – బుద్ధా వెంకన్న

ఇక బియ్యం కుంభకోణం కేసులో పేర్ని నాని భార్య పేరును అక్రమంగా ఉపయోగించి తప్పించుకున్నారని ఆరోపించిన వెంకన్న, వంశీ, కొడాలి నానీలు చంద్రబాబు కుటుంబాన్ని ఎలా తిట్టారో అందరికీ తెలుసని అన్నారు. ఈ నేతల అసభ్య వ్యాఖ్యల వల్లే వైసీపీ ప్రజల్లో తిరస్కారాన్ని ఎదుర్కొంటోందని, ఇదే కారణంగా పార్టీ ఓటమిని చవిచూసిందన్నారు. వంశీని అరెస్ట్ చేసిన విషయాన్ని అక్రమ అరెస్టుగా చెప్పడం లాజికే కాదని, ఆయనపై కుటుంబ సభ్యులకే విరక్తి కలిగిందని ఎద్దేవా చేశారు. జైల్లో ఉన్నప్పుడు వంశీని ఆయన కుటుంబ సభ్యులే చూసేందుకు రాలేదన్న ఆరోపణలు చేసి తీవ్ర విమర్శలు చేశారు.

గతంలో రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలను అరికట్టిన వ్యక్తి చంద్రబాబేనని గుర్తుచేసిన వెంకన్న, వంశీ, కొడాలి నానీల మాటలు చూస్తే ఫ్యాక్షనిస్టులకే అసహ్యం వేస్తుందని అన్నారు. పేర్ని నాని పెద్ద బియ్యం స్కాం చేసిన వ్యక్తిగా విమర్శలు చేస్తూ, చర్చకు సిద్ధమవ్వాలని సవాల్ చేశారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది